Laya: యూఎస్‌లో ఈ సీనియర్ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా?

అలనాటి హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లో వెలుగు వెలిగిన హీరోయిన్లలో లయ కూడా ఒకరు. చూపులు తిప్పుకోలేని అందం, అద్భుతమైన నటన రెండు కలిస్తే దానికి వచ్చే రూపం లయ. బాలనాటిగా కెరీర్ ని ప్రారంభించిన ఈమె ఆ తర్వాత స్వయంవరం అనే సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా భారీ హిట్ అవ్వడమే కాదు, లయకి ఉత్తమ నటిగా నంది అవార్డుని కూడా తెచ్చి పెట్టింది.

ఆ సినిమా తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇలా 2006వ సంవత్సరంలో వివాహం చేసుకొని అమెరికా వెళ్లినటువంటి లయ అక్కడ ఉద్యోగం చేస్తూ భారీగా డబ్బు సంపాదించే వారని తెలుస్తోంది. ఇలా అమెరికాలో స్థిరపడిన లయ చాలా కాలం తర్వాత ఇండియాకు తిరిగివచ్చారు. అయితే ఈమె ఇండియాకు రావడంతో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె అమెరికాలో తను ఏం చేస్తుండేవారు తెలియజేశారు. 2011 నుంచి ఈమె ఐటీ సెక్టార్ ఉద్యోగం చేసే వారని తెలియజేశారు. అయితే ఇండియాకు చెందిన కంపెనీకి తను ఉద్యోగం చేసేదానినని వెల్లడించారు. ఆ సమయంలో తనకు టాక్స్ లన్నీ పోను నెలకు 12,000 డాలర్లు జీతం వచ్చేదని తెలిపారు. ఇక ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈమె నెలకు ఏకంగా 9,60,000 జీతం అందుకునేవారని ఈ సందర్భంగా లయ తెలియజేశారు. ఇక తాను 2017లో ఈ జాబ్ వదిలేసానని, అనంతరం డాన్స్ స్కూల్ ప్రారంభించామని తెలిపారు. అయితే కోవిడ్ కారణంగా తమ డ్యాన్స్ స్కూల్ కూడా మూతపడిందని లయ తెలియజేశారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు