Adivi Sesh: అక్కినేని మేనకోడలుతో కారులో అడ్డంగా దొరికిన హీరో

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో సెలబ్రెటీల పర్సనల్ విషయాలు ఈజీగా బయటకు వస్తున్నాయి. చాలా సీక్రెట్ గా తమ పర్సనల్ లైఫ్ ను గడుపుతున్న స్టార్స్ కొన్ని, చిన్న చిన్న మిస్టేక్స్ తో పబ్లిక్ అవుతున్నారు. ఇటీవలే నాగ చైతన్య, శోభిత ధూళిపాళ రిలేషన్ షిప్ గురించి అనేక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. శోభితతో నాగ చైతన్య ఒక హొటల్ కు వెళ్లగా, చెఫ్ తో ఓ ఫోటో తీసుకున్నాడు. చెఫ్ ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, పక్కన శోభిత కనిపించింది.

దీంతో గత కొద్ది రోజులుగా నాగ చైతన్య, శోభితల మధ్య ఏదో నడుస్తుంది అంటూ వచ్చిన వార్తలకు మరింత బలం చేకూరింది. అంతే కాదు.. శోభితతో నాగ చైతన్య రెండో పెళ్లికి కూడా రెడీ అయిపోయాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. తాజాగా మరో హీరో కూడా అడ్డంగా దొరికిపోయాడు. అతను ఎవరో కాదు.. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొడుతూ, రీసెంట్ గా మేజర్, హిట్ 2తో బ్లాక్ బస్టర్స్ అందుకున్న అడివి శేష్.

ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే పార్టీ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి చాలా మంది సెలబ్రెటీలు వచ్చాయి. అలాగే అడివి శేష్ కూడా వచ్చాడు. అతను ఒక్కడే వస్తే.. న్యూస్ కాదు. కానీ, అతనితో పాటు అక్కినేని నాగార్జున మేన కోడలు సుప్రియ కూడా ఉంది. ఇద్దరు ఒకే కారులో రామ్ చరణ్ పార్టీకి హాజరయ్యారు. అడివి శేష్ అక్కడ ఉన్న వారికి ఫోటోలకు ఫోజులు ఇవ్వగా, సుప్రియ మాత్రం నేరుగా వెళ్లిపోయింది. అడివి శేష్, సుప్రియ రిలేషన్ షిప్ లో ఉన్నారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

ఇటీవల అక్కినేని ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకల్లో సుప్రియతో అడివి శేష్ కనిపించాడు. పక్కనే కూర్చోవడం, కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో సుప్రియ, అడివి శేష్ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో కూడా ఈ జంట ఒకే కారులో రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మరి వీరి రిలేషన్ షిప్ పై ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తారో చూడాలి.

కాగా అక్కినేని నాగార్జున మేనకోడలు అయిన సుప్రియ.. ఇష్టం చిత్ర హీరో చరణ్ రెడ్డితో పెళ్లి అయిన సంగతి విధితమే. కానీ, చరణ్ రెడ్డి 2012లోనే గుండెపోటుతో చనిపోయాడు. ఆయన చనిపోక ముందే, చరణ్ తో విడాకులు కావాలని సుప్రియ కోర్టు మెట్లు ఎక్కింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు