Rangasthalam: చరణ్ మరో అవతారానికి ఐదేళ్లు

సుకుమార్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఒక క్లాస్ టచ్ ఉంటుంది అనేది దాదాపు సినిమా అభిమానుల నమ్మకం. కానీ వాటన్నింటిని బ్రేక్ చేసి ఒక కమర్షియల్ హిట్ ను ఇచ్చాడు సుకుమార్. అప్పటివరకు సుకుమార్ సినిమాలో హీరోలందరూ క్లాస్ గా కనిపించేవారు. కానీ రంగస్థలం సినిమాలో చరణ్ కి ఒక మాస్ లుక్ సెట్ చేసి చాలా అందంగా చూపించి ఒక కమర్షియల్ హిట్ సినిమాను చరణ్ ఖాతాలో వేశారు సుకుమార్.ఇప్పటికి ఐదేళ్లు పూర్తి అయినా ఆ సినిమా ఇంపాక్ట్ అలానే ఉందంటే.సినిమా ఎంత పెద్ద హిట్టో మనకు తెలియంది కాదు.

సుకుమార్, అందరికి తెలిసిన కథను సరికొత్త కోణంలో చెప్పడం ఈయనకి పెన్నుతో పెట్టిన విద్య. మొదటి సినిమా ఆర్యతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు సుకుమార్. ఆ తరువాత చేసిన జగడం సినిమాతో “విలనిజం” కు కొత్త అర్ధాన్ని చూపించాడు. ఆర్య సినిమాకు సీక్వెల్ గా చేసిన ఆర్య-2 సినిమా కూడా మంచి రిజల్ట్ అందించింది. ఆ సినిమా తరువాత చేసిన నాగ చైతన్య 100% లవ్ సినిమా కూడా సుక్కు కు 100 మార్క్స్ ను తీస్కుని వచ్చింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసిన వన్ సినిమా ఫెయిల్ అయినా ఒక దర్శకుడిగా సుకుమార్ మాత్రం ఫెయిల్ అవ్వలేదు, తారక్ హీరోగా చేసిన “నాన్నకు ప్రేమతో” సినిమాతో అందరిని ఆశ్చర్యపరిచాడు సుకుమార్.కేవలం క్లాస్ సినిమాలు మాత్రమే కాదు కమర్షియల్ సినిమాను తీయడంలో కూడా తన స్టామినా ఏంటో నిరూపించాలి అని అనుకున్నాడేమో బహుశా “రంగస్థలం” సినిమాతో ఒక చెరగని ముద్రను వేశారు సుకుమార్. రామ్ చరణ్ కెరియర్ లో ఎప్పటికి మిగిలిపోయే సినిమాల్లో రంగస్థలం ఒకటి అని చెప్పొచ్చు. నేటితో రంగస్థలం 5 ఏళ్ళు పూర్తిచేసుకుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు