Ravanasura: ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం

‘ధమాకా’ సక్సెస్ తరువాత మాస్ మహారాజ, సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో మరో సరి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా లో దక్ష నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్, అను ఇమ్మానుయేల్ మరియు అక్కినేని హీరో సుశాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ విడుదల అయినప్పటినుంచే అంచనాలు ఎన్నో రేట్లు పెరిగిపోయాయి. ఫస్ట్ లుక్ తోనే రవి తేజ ని ఆక్షన్ మోడ్ లో నెవెర్ బిఫోర్ లుక్ లో చూపించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో ఓ వైపు క్రైమ్ సీన్స్ మరో వైపు కామెడీ ఎంటర్టైనర్ గా బ్యాలన్స్ చేస్తూ చిత్రీకరించారని అనిపించింది. దీనితో ప్రేక్షకులు రవి తేజ కామెడీ నుంచి ఆక్షన్ కు మార్చే షేడ్స్ ని చూసేందుకు ఎంతో ఎదురు చూస్తున్నారు.

ట్రైలర్ చుసిన తరువాత, ఇందులో రవి తేజ త్రిబుల్ ఆక్షన్ రోల్ లో కనిపించనున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. రావణాసుర ఆంథెమ్ విడుదల కావటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 1వ తేదీన శిల్పకళా వేదిక, హైటెక్ సిటీ , హైద్రాబాదులో సాయంత్రం 6 గంటలకు జరగనుందని మేకర్స్ పోస్టర్ ని రిలీజ్ చేసి ప్రకటించారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు