Guna Sekhar: శాకుంతల పాత్రకు ముందుగా సమంతను అనుకోలేదు

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. పీరియాడికల్ చిత్రాలను తెరకెక్కించడంలో మంచి సామర్థ్యం ఉన్న గుణశేఖర్ ఈ చిత్రాన్ని కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. శాకుంతలం పాత్రలో సమంత నటిస్తుండగా, దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన పోస్టర్లు, సాంగ్స్ తో పాటు ట్రైలర్ భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేశాయి.

సినిమా విజువల్ వండర్ గా ఉంటుందని గుణశేఖర్ నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాలను మించేలా ఉంటుందని తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాపై గుణశేఖర్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు సంవత్సర కాలం పట్టింది. షూటింగ్ తర్వాత ఏడాదిన్నర పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాం. అలా ఈ సినిమాను సిద్ధం చేయడానికి నాకు మూడేళ్లు పట్టింది. అలాగే శాకుంతలను కాళిదాసు ఎలా వర్ణించారనేది నేను చదివా.

ఆ పాత్రకి ఎవరైతే బాగుంటుందని ఆలోచన చేశా. మొదట నేను సమంతను తీసుకోవాలని అనుకోలేదు. సమంత అయితేనే బాగుంటుందని మా అమ్మాయి చెప్పింది. ఆ సమయంలో మరోసారి రంగస్థలం చూసా. ఓ పాత్రలో సమంత ఎంతగా ఒదిగిపోతుందనేది నాకు అర్థమైంది. అప్పుడు ఆమెను సంప్రదించాను’ అని అన్నారు.

- Advertisement -

కాగా, శాకుంతల పాత్రలో సామ్ అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన సమంత ఫోటోలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అలాగే ఇటీవల 14 కిలోల బంగారంతో ఉన్న ఫోటోను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఆ ఫోటో కూడా ఫుల్ వైరల్ అయింది. దీంతో శాకుంతల పాత్రలో సమంతను మినహా ఏ నటికి కూడా ఊహించుకోలేని విధంగా బజ్ ను క్రియేట్ చేసింది. కాగా, ఈ మూవీ ఏప్రిల్ 14న థియేటర్లలో సందడి చేయనుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు