Venky75: బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న సైంధవుడు

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “సైంధవ్”. హిట్, హిట్ 2 చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. తెలుగులో ఆయనకిదే మొదటి సినిమా.

ఈ మధ్యే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ అభిమానుల అంచనాలను అందుకుంది. వెంకటేష్ ను మళ్ళీ గణేష్, ఘర్షణ సినిమాలో లాంటి రోల్ లో చూడాలనుకున్న ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది ఈ టీజర్. రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తో పోయిన ఇమేజ్ ను ఈ సినిమా ద్వారా మళ్ళీ దక్కించుకుంటాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

అయితే సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పకపోయినా టైటిల్ తో మాత్రం మంచి హైప్ ఎక్కించాడు దర్శకుడు. “సైంధవ్”, అంటే మహాభారతం లో ఒక పాత్ర పేరు. పాండవులను వారి సమస్త సైన్యాన్ని ఎదుర్కోవడానికి కౌరవుల తరపున తాను ఒక్కడే ముందుండి ఎదిరించినవాడు. దీన్ని బట్టి వెంకటేష్ ఒక్కడే సింగిల్ హ్యాండ్ తో విలన్స్ ని ఎదుర్కొంటాడని సినిమాలో ఉన్న డైలాగుల ద్వారా అర్ధమవుతుంది. అలాగే వెంకటేష్ కి ఇది 75 వ సినిమా.

- Advertisement -

తాజాగా ఈ సినిమా మేకర్స్ రిలీజ్ డేట్ ని ప్రకటించడం జరిగింది. క్రిస్మస్ కానుక గా 2023 డిసెంబర్ 22 న విడుదల చేస్తున్నామని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసి చెప్పారు.సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్నఈ సినిమా పాన్ ఇండియా సినిమా గా 5 భాషల్లో విడుదలకు సిద్ధమవుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు