Naga Chaitanya: సమంత ఇప్పుడే ఎందుకు ?

సమంత, నాగ చైతన్యకు డైవర్స్ అయి దాదాపు రెండేళ్లు గడుస్తుంది. ఈ రెండేళ్లలో అటు నాగ చైతన్య గానీ, ఇటు సమంత గానీ డైవర్స్ కుగల కారణాన్ని ఎప్పుడు, ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ, సమంత ఇటీవల శాకుంతలం ప్రమోషన్లలో భాగంగా, డైవర్స్ గురించి, పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వైవాహిక జీవితం విషయంలో తాను 100 శాతం నిజాయితీగా ఉన్నానని, కానీ, అది తనకు వర్కౌట్ కాలేదని చెప్పుకొచ్చింది. అలాగే తనేమీ తప్పు చేయలేదని, అలాంటి సమయంలో ఎందుకు బాధపడాలని అన్నారు.

అంటే సమంత, నాగ చైతన్య వైవాహిక జీవితంలో సమంత నుంచి ఎలాంటి తప్పు లేదని, నాగ చైతన్య నుంచే ఏదో మిస్టేక్ జరిగింది అన్నట్టు సామ్ ఇన్ డైరెక్ట్ గా చెప్పింది. అది కూడా నాగ చైతన్య, శోభిత ధూళిపాళ హోటల్ లో ఉన్న ఫోటో బయటకు వచ్చి, వైరల్ అవుతున్న సమయంలోనే సామ్ ఈ వ్యాఖ్యలు చేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

నాగ చైతన్యకు శోభితకు మధ్య పరిచయం చాలా రోజుల నుంచి ఉందని, ఆ సమస్య వల్లే సామ్ కు డైవర్స్ ఇచ్చారని కూడా టాక్ వస్తుంది. అలాగే అక్కినేని నాగ చైతన్య కూడా ప్రస్తుతం రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడట. శోభితతో ఏడు అడుగులు వేయడానికి చైతన్య ఫిక్స్ అయ్యాడని కూడా రూమర్స్ వస్తున్నాయి. మొత్తంగా నాగ చైతన్య, శోభిత వ్యవహారం వల్లే తనకు డైవర్స్ ఇచ్చాడని సమంత చెప్పకనే చెప్పింది. అందుకే తాను వైవాహిక జీవితంలో 100 శాతం నిజాయితీగా ఉన్నానని, తన తప్పేమీ లేదని సామ్ చెప్పిందని అభిమానులు అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు