Salaar vs Jawan:హెవీ ఎక్స్పెక్టేషన్స్ – రీచ్ అయ్యేదెవరు…?

Salaar vs Jawan

రోజు రోజుకీ ఇండియన్ సినిమా మార్కెట్ పెరుగుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ మార్కెట్ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు ఆ తర్వాత అని చెప్పాలి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కి పెరిగిన టాలీవుడ్ మార్కెట్, RRR సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ కి ఎదిగింది. ర్ర్ర్ ఇచ్చిన స్పూర్తితో ప్రస్తుతం టైర్2 హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. మొన్నటిదాకా పెద్ద సినిమాలకు 100కోట్ల మార్క్ మైల్ స్టోన్ గా ఉండగా ఇప్పుడు అది కాస్తా 1000కోట్లకు చేరింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమా 1000కోట్ల మార్క్ టార్గెట్ గా రిలీజ్ కానుంది.

1000కోట్ల మార్కెట్ అంచనాలతో విడుదలైన ఆదిపురుష్ సినిమా నిరాశ పరిచిన నేపథ్యంలో ప్రభాస్ కి ఈ సినిమా కీలకంగా మారింది. షారుక్ ఖాన్, అట్లీ కాంబినేషన్లో రూపొందిన జవాన్ సినిమా కూడా 1000కోట్ల మార్క్ టార్గెట్ తో రిలీజ్ కానుంది. సలార్ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానుండగా, జవాన్ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది.

3వారాల గ్యాప్ తో రిలీజ్ కానున్న ఈ రెండు సినిమాలలో 1000కోట్ల మార్క్ అందుకునేది ఎవరన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇటీవల పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న షారుక్ ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ అందుకొని ఆ సీక్వెన్స్ ని కంటిన్యూ చేయాలని ట్రై చేస్తుండగా, సలార్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకొని తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని ప్రభాస్ భావిస్తున్న నేపథ్యంలో ఇద్దరిలో ఎవరు టార్గెట్ రీచ్ అవుతారో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు