Abhiram Daggubati: తొందరపడ్డ యంగ్ హీరో – ఇంకో వికెట్ డౌన్..!

Abhiram Daggubati

సెలెబ్రిటీలు అన్నాక లేటుగా పెళ్లి చేసుకోవటం కామన్. టాలీవుడ్లో కూడా చాలా మంది హీరోలు కెరీర్ లో సెట్ అయ్యేంతవరకు వెయిట్ చేసి పెళ్లి చేసుకున్నారు. 43ఏళ్ళు వచ్చినా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. అలాంటిది, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ కాస్త తొందరపడినట్లు తెలుస్తోంది.

ఈ ప్లే బాయ్ తమ్ముడు పెళ్లికి సిద్దమవుతున్నాడని సమాచారం అందుతోంది.  హీరోగా చేసింది ఒక్క సినిమా మాత్రమే, అది కూడా ఎప్పుడు రిలీజయ్యిందో కూడా తెలియనంత డిజాస్టర్ అయ్యింది. అలా ఎంట్రీ ఇచ్చి ఏడాది కూడా కాకముందే అభిరాం పెళ్ళికి రెడీ అవ్వటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

రామానాయుడు తమ్ముడైన మోహన్ బాబు కూతురు కూతురితో అభిరామ్ పెళ్లి ఫిక్స్ అయ్యిందని సమాచారం అందుతోంది. త్వరలోనే నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి జరుగుతుందని అంటున్నారు. టాలీవుడ్ హీరోలంతా లవ్ మ్యారేజెస్, లేదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటున్న క్రమంలో అభిరామ్ ఇలా దగ్గరి బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

- Advertisement -

ఈ వార్తతో అభిరామ్ మీద ఆ మధ్య వచ్చిన గాసిప్స్ తుడిచిపెట్టుకు పోతాయని కొంతమంది కామెంట్ చేస్తుండగా ఇంకొంత మంది అభిరామ్ కి అంత తొందరెందుకు, టాలీవుడ్లో ఇంకో వికెట్ డౌన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, పెళ్ళికి ముందు చేసిన అహింస సినిమా ద్వారా ఘోర డిజాస్టర్ చవిచూసిన అభిరామ్ పెళ్లి తర్వాత అయినా బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు