King Khan’s Jawan: అక్కడ కూడా అనిరుధ్ విశ్వరూపం చూపిస్తాడా..?

King Khan’s Jawan

అనిరుధ్ రవిచంద్రన్, ఈ పేరు వింటేనే సౌత్ ఆడియెన్స్ కి హైప్ ఎక్కుతుంది. 17 ఏళ్ళ వయసులో మ్యూజిక్ డైరెక్షన్ ప్రారంభించిన ఈ యువ సంచలనం క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా అన్ని జానర్స్ లో అదిరిపోయే మ్యూజిక్ ఇస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాకు ఫస్ట్ ప్రయారిటీగా మారిపోయాడు అనిరుద్. రీసెంట్ గా రజినీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమా హిట్ అవ్వటంతో అనిరుధ్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జైలర్ సినిమాలో సాదాసీదాగా ఉన్న సీన్లు కూడా అనిరుధ్ ఇచ్చిన ఎక్స్ట్రార్డినరీ బీజీఎమ్ వల్ల మరో లెవెల్ కి చేరాయని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే అనిరుద్ మ్యూజిక్ లేకపోయి ఉంటే జైలర్ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అయ్యుండేది కాదేమో.

అనిరుధ్ మ్యూజిక్ డైరెక్షన్ చేసిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ జవాన్ కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. సెప్టెంబర్ 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్, సాంగ్ ఇప్పటికే రిలీజ్ కాగా వాటికి అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. సౌత్ లో తన మ్యూజిక్ తో ఎన్నో సినిమాలను బ్లాక్ బస్టర్ రేంజ్ కి తీసుకెళ్లిన అనిరుద్ జవాన్ సినిమాని కూడా బ్లాక్ బస్టర్ చేస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు.

షారుఖ్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, తలపతి విజయ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. షారుఖ్ గత చిత్రం పఠాన్ బ్లాక్ బస్టర్ అయిన క్రమంలో ఈ సినిమా 1000కోట్ల మార్క్ క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరి, సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీపై తన మ్యూజిక్ తో స్ట్రాంగ్ మార్క్ వేసిన అనిరుధ్ బాలీవుడ్లో కూడా తన సత్తా చాటుతాడా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు