MegaStar’s BholaaShankar: మెగా హేటర్స్ కి స్లిప్పర్ షాట్..!

నిజం చెప్పులేసుకునే లోపు అబద్దం ప్రపంచమంతా చుట్టి వస్తుందనే సామెత అందరికీ తెలిసినదే. సెలెబ్రిటీల గురించి రూమర్స్ విషయం ఈ సామెతకు కరెక్ట్ ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అనిల్ సుంకర మధ్య విభేదాలున్నాయంటూ వస్తున్న రూమర్స్ కి కూడా ఈ సామెత వస్ర్తిస్తుందని చెప్పాలి. భోళా శంకర్ డిజాస్టర్ అవ్వటంతో ఇదే అదునుగా యాంటీ ఫ్యాన్స్ ఈ రూమర్స్ ని స్ప్రెడ్ చేయటం స్టార్ట్ చేశారు. కొన్ని వెబ్ సైట్స్, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా వారికి తోడవ్వడంతో ఈ రూమర్స్ దావానలంలా వ్యాపించాయి. ఇటీవల నిర్మాత అనిల్ సుంకర అలాంటిదేమి లేదంటూ క్లారిటీ ఇచ్చిన వాట్సాప్ చాట్ బయటికి  వచ్చినా కూడా ఆ రూమర్స్ ఆగలేదు.

తాజాగా అనిల్ సుంకర తన ట్విట్టర్ ద్వారా ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న మెగా హేటర్స్ కి స్లిప్పర్ షాట్ లాంటి సమాధానం ఇచ్చాడు. తనకి చిరంజీవికి మధ్య విభేదాలున్నట్లు వస్తున్న రూమర్స్ లో ఏ మాత్రం వాస్తవం లేదని, ఈ రూమర్స్ కొంతమంది రాక్షసానందం కోసమే స్ప్రెడ్ చేస్తున్నారని వాటిని నమ్మొద్దని ట్వీట్ ద్వారా తెలియజేశారు.

ఇప్పటికీ తనకి, చిరంజీవికి మధ్య సత్సంబంధం ఉందని, ఈకష్ట సమయంలో తన పట్ల కన్సర్న్ చూపిస్తున్న సన్నిహితులు, శ్రేయోభిలాషుల బ్లెస్సింగ్స్ తో తప్పకుండ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తానని ధీమా వ్యక్తం చేశాడు అనిల్ సుంకర. మొత్తానికి అనిల్ సుంకర ట్వీట్ మెగా హేటర్స్ కి స్లిప్పర్ షాట్ అయ్యిందని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు