Thalapathy68: విజయ్ వెంకట్ ప్రభు సినిమాలో ఫ్యాన్స్ కి బిగ్ సప్రైజ్..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, దర్శకుడు  వెంకట్ ప్రభు కాంబినేషన్లో ఓ సినిమా రానుందని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ అధికారిక ప్రకటన వచ్చింది ఇటీవల. కస్టడీ సినిమాతో డిజాస్టర్  అందుకున్న వెంకట్ ప్రభుకి విజయ్ ఛాన్స్ ఇవ్వటం పట్ల  వ్యక్తమవుతోంది. ఏజీఎస్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నాడు. అయితే, ఈ సినిమా విషయంలో మరొక ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే, ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ ఆ మధ్య రిలీజ్ చేసిన వీడియోలో విజయ్ పేరుకి పక్కన ఎన్టీఆర్ అనే అక్షరాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడన్న ఊహాగానాలు కూడా చక్కర్లు కొట్టాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ఈ గాసిప్ లో  నైజమవుతుందో లేదో  తెలీదు కానీ, ఒకవేళ నిజం అయితే గనక మరో క్రేజీ పాన్ ఇండియా సినిమా అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం లోకేష్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో లియో సినిమాలో నటిస్తున్న విజయ్,  త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా మొదలుకాక ముందే తరచూ ఏదో ఒక అప్డేట్ తో  అంచనాలు పెంచుతున్న ఈ సినిమా ద్వారా అయినా డైరెక్టర్ వెంకట్ ప్రభు కి బ్లాక్ బస్టర్ అందుతుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు