Thalapathy68: విజయ్ సినిమాలో ఎన్టీఆర్ – హింట్ ఇదిగో..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, దర్శకుడు  వెంకట్ ప్రభు కాంబినేషన్లో ఓ సినిమా రానుందని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ అధికారిక ప్రకటన వచ్చింది ఈ రోజు. కస్టడీ సినిమాతో డిజాస్టర్  అందుకున్న వెంకట్ ప్రభుకి విజయ్ ఛాన్స్ ఇవ్వటం పట్ల  వ్యక్తమవుతోంది. ఏజీఎస్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నాడు. అయితే, ఈ సినిమా విషయంలో మరొక ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే, ఈ సినిమాలో విజయ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించనున్నాడని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది.

ఈ సినిమా అప్డేట్ కి సంబంధించి రిలీజ్ చేసిన వీడియోలో హీరో విజయ్ పేరుకి పక్కన ఎన్టీఆర్ అన్న అక్షరాలు ఉండటం ఈ చర్చకి దారి తీసింది. RRR ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో విజయ్ సినిమాలో కూడా ఎన్టీఆర్ నటించనున్నాడన్న గాసిప్ మొదలవ్వటంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ గాసిప్ లో  నైజమవుతుందో లేదో  తెలీదు కానీ, ఒకవేళ నిజం అయితే గనక మరో క్రేజీ పాన్ ఇండియా సినిమా అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం లోకేష్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో లియో సినిమాలో నటిస్తున్న విజయ్,  త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా మొదలుకాక ముందే అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్న ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చుతుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు