Alia Bhatt- Ranbir couple secret : అలియా భట్ ఆ పని చేయడం రణ్ బీర్ కు నచ్చదంట ?

Alia Bhatt Ranbir couple secret

బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ అలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. గతకొద్ది కాలంగా కేవలం బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఈ బ్యూటీ ఇటీవలనే ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చి, ఇక్కడి ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. బాలీవుడ్ లోనే హ్యాండ్సమ్ హంక్ గా పేరున్న రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న అలియా భట్ తన భర్త అయిన రణ్ బీర్ బిహేవియర్ పై  ఇటీవలనే ఒక షాకింగ్ కామెంట్ చేసింది.

గత కొద్దీ రోజుల క్రితం వరకు ప్రేమికులుగా నిత్యం వార్తల్లో మెదులుతూ ఉండే ఈ జంట, ఇటీవలనే పెళ్లి చేసుకొని ఒక్కటైన విషయం విదితమే. ఇక వీళ్ళ ప్రేమకు గుర్తుగా రీసెంట్ గా  ఒక పండంటి ఆడపిల్ల కూడా పుట్టింది. సినిమాల పరంగా, వైవాహిక జీవితం పరంగా సంతోషంగా ఉంటూ, భార్య భర్తలిద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు.

ప్రస్తుతం రణ్ బీర్కపూర్ అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్స్ లో యానిమల్ సినిమాలో నటిస్తుండగా, అలియా ఇటీవలనే రణ్ వీర్ సింగ్ తో కలిసి రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జులై 28 న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి మంచి రెస్పాన్స్ అందుకొని, బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది.

- Advertisement -

కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొన్న అలియా భట్, రణ్ బీర్ తో తన వైవాహిక జీవితంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అదేంటంటే రణ్ బీర్ కపూర్, అలియా భట్ బయటికి వెళ్లే టైం లో తాను లిప్ స్టిక్ పెట్టుకుంటే రణ్ బీర్ కు నచ్చదని, వెంటనే లిప్ స్టిక్ తుడిచేయమని అని వార్నింగ్ ఇస్తాడని ఆమె చెప్పింది. షూటింగ్ లో, మరియు సినిమాలలో లిప్ స్టిక్ పెట్టుకోడానికి ఏ అభ్యతరం చెప్పని రణ్ బీర్ బయటికి వెళ్లాల్సి వచ్చినపుడు మాత్రం లిప్ స్టిక్ ను వేసుకుంటే అస్సలు సహించడంటూ రణ్ బీర్ కపూర్ కు గురించి, వారి వైవాహిక జీవితంలోని లిటిల్ సీక్రెట్ ను రివీల్ చేసింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు