Alia Bhatt: వాళ్ల కోసం ఆ పని చేస్తా

‘స్టూడెంట్ అఫ్ ది ఇయర్’ సినిమా తో తెర పైకి వచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడైతే దర్శక ధీరుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో.. అప్పటినుంచి ఈమెను తెలుగు ప్రేక్షకులు సైతం బాగా గుర్తుపెట్టుకున్నారు. ఇక గతేడాది రణ్బీర్ కపూర్ – అలియా భట్ లు వివాహం చేసుకొని నవంబర్ లో ఓ ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ పాపకు వారు రాహా అని పేరు కూడా పెట్టారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్లు సినిమాలలో నటిస్తూనే తమ సొంత ఫ్యాషన్, స్కిన్ కేర్ బ్రాండ్స్ ప్రారంభిస్తూ వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. దీపిక పడుకొన్, ప్రియాంక చోప్రా ఇలా ఎంతోమంది హీరోయిన్లు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు.

ఇలా ఆలియా భట్ కూడా ‘ఎడ్ ఎ మమ్మ’ అనే దుస్తుల కంపెనీ బ్రాండ్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హీరోయిన్లు ఇలా సినీ రంగంతో పాటు సొంత బ్రాండ్స్ ప్రారంభించడంపై ఆలియా భట్ మాట్లాడుతూ.. తన సహ నాయికలు చాలామంది ఫ్యాషన్, స్కిన్ కేర్ వ్యాపారవేత్తలుగా మారారని.. వాళ్ల కోసం వీలైనంత ప్రచారం చేస్తానని తెలిపింది. తాను అలా సపోర్ట్ చేస్తున్నది వారు కేవలం మహిళలు అని కాదని.. ఏదైనా ఒక కొత్త పనిని మొదలు పెట్టే వారి ధైర్యాన్ని ఇష్టపడతానని తెలిపింది. వాళ్లు ఏం చేయగలరో నిరూపించుకునేందుకు చేసే ప్రయత్నాన్ని తాను కచ్చితంగా ప్రశంసిస్తానని తెలిపింది ఆలియా భట్.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు