Seerat Kapoor : మూడేళ్ళుగా ఒక్క ఛాన్స్ లేదు.. ఇక ఐటెం సాంగ్ లకే మొగ్గు?

Seerat Kapoor : టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్లకు కొదవలేదని అంటూ ఉంటారు. అది ముమ్మాటికీ నిజమే. ప్రతి సంవత్సరం కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. కానీ అందులో కొందరే సక్సెస్ అవుతారు. మరి కొందరు ఇంకా ఛాన్సుల కోసం ట్రై చేస్తారు. అయితే హీరోల పరంగా టాలీవుడ్ లో ఒక సినిమా ప్లాప్ అయితే పట్టించుకోరుగాని, హీరోయిన్ల సినిమాలు ప్లాప్ అయినా, కెరీర్ బిగినింగ్ లో వాళ్ళ గ్లామర్ షో టాలెంట్ ని బట్టి అవకాశాలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిని సద్వినియోగ పరుచుకుని స్టార్ హీరోయిన్లు గా మారిన నటీమణులు కొందరే ఉంటారు. మరి కొందరు ఇప్పటికీ తమని తాము నిరూపించుకుంటూనే ఉన్నారు. అలాంటి హీరోయిన్లలో సీరత్ కపూర్ ఒకరు. టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటించిన రన్ రాజా రన్ చిత్రంతో పదేళ్ల కింద తెలుగు తెరకు పరిచయమైంది సీరత్ కపూర్. ఈ సినిమాలో ఆమె అందం, అభినయంతో మెప్పించింది. మొదటి సినిమాయే బ్లాక్ బస్టర్ అయ్యే సరికి వరుస ఆఫర్లు క్యూ కడతాయని అనుకున్నారు అందరు. అవకాశాలైతే వచ్చాయి గాని పెద్ద హీరోల సినిమాల్లో అయితే రాలేదు.

బిగినింగ్ డేస్ లో వరుస సినిమాలు..

ఇక సీరత్ కపూర్ (Seerat Kapoor) రన్ రాజా రన్ తర్వాత చిన్న సినిమాలు చేసినా, వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఆ తర్వాత 2015లో సందీప్ కిషన్ నటించిన టైగర్ చిత్రంలో నటించగా, ఇక ఆ తర్వాత కొలంబస్, రాజు గారి గది 2, టచ్ చేసి చూడు, ఒక్క క్షణం చిత్రాల్లో నటించింది. ఇవన్నీ అంతగా ఆడలేదు. ఇక సినీరంగంలో అనేక మంది అందాల తారలు అడుగుపెట్టి తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుని.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్లుగా ఎదిగినవారున్నారు. అలాగే ఒకటి రెండు చిత్రాలు చేసి ఇండస్ట్రీకి దూరమైనవారు ఉన్నారు. ఆ జాబితాలో సీరత్ కపూర్ కూడా చేరేలా ఉంది. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ భామ, ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. కానీ.. ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. దీంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి. అయితే ఈ హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది.

ఐటెం సాంగులు చేసుకోవాల్సిందేనా?

అయితే సీరత్ కపూర్ చివరగా, మా వింత గాధ వినుమా సినిమాలో నటించింది. ఇక హిందీలో మారిచ్ అనే క్రైం థ్రిల్లర్ లో నటించింది. ఆ తర్వాత సీరత్ కపూర్ చాలా రోజులుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఈ సంవత్సరం సీరత్ కపూర్ ఓటిటి సినిమా ద్వారా మళ్ళీ ఆడియన్స్ ని పలకరించింది. రీసెంట్ గా ఆహా లో వచ్చిన భామ కలాపం 2 లో కీలక పాత్రలో నటించగా, లేటెస్ట్ గా వచ్చిన సేవ్ ది టైగర్స్ ఓటిటి లో కూడా కీలక పాత్రలో నటించింది. ఇక సీరత్ కపూర్ కేవలం నటి మాత్రమే కాదు.. మంచి డాన్సర్ కూడా. బాలీవుడ్ ఇండస్టీలో కొరియోగ్రాఫర్ గా చేసిన సీరత్ కపూర్.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా సీరత్ కపూర్ టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ విజయ్ భాస్కర్ తీస్తున్న కొత్త సినిమా ఉషా పరిణయం లో ఐటెం సాంగ్ చేసింది. అయితే మంచి గ్లామర్ టాలెంట్ ఉన్న సీరత్ కపూర్ కి హీరోయిన్ గా మంచి సక్సెస్ కొట్టకపోతే ఇక ఐటెం సాంగ్స్ చేసుకోవడమే పనిగా పెట్టుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ అమ్మడు అదృష్టం ఎలా ఉందొ చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు