Chandini Chowdary : IPL పేరుతో మీది, మాది అంటూ చిచ్చు పెడుతున్న చాందినీ చౌదరి…

Chandini Chowdary : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో చాందిని చౌదరి ఒకరు. ఈ అమ్మాయి తెలుగమ్మాయి కావడం మంచి విశేషమని చెప్పాలి. పదేళ్ల కింద షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ మొదలు పెట్టి కేటుగాడు అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘మను’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అయితే చాందిని ని కి బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘కలర్ ఫోటో’ సినిమాయే. ఈ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తెలుగమ్మాయి చాందిని చౌదరి (Chandini Chowdary) వరుస సినిమాలతో దూసుకుపోతుంది. రీసెంట్ గా విశ్వక్ సేన్ తో కలిసి గామి చిత్రంలో నటించింది. ఇక చాందిని చౌదరి అప్పుడప్పుడూ తెలుగమ్మాయిలకు సంబంధించి అప్పుడప్పుడూ ఆవేదనతో అవకాశాలు మనవాళ్లకు రావని ఇండస్ట్రీలో చురకలు అంటిస్తూనే ఉంటుంది. అలాగే తన సినిమాలకు సంబంధించి కెరీర్ బిగినింగ్ డేస్ లో పలానా వాళ్ళతో సమస్య వచ్చింది అని ఇంటర్వ్యూ లలో చెప్పడం వింటూనే ఉంటాం. ఇక ఇప్పుడు మళ్ళీ కొత్త చిచ్చు లేపింది చాందిని. అయితే అది సినిమా ఇండస్ట్రీ గురించి కాదు. తెలుగు రాష్ట్రాల గురించి. దానికి IPL కారణమైంది?

మీకు టీమ్ ఉంది మాకు లేదు..

అసలు విషయానికి వస్తే.. చాందిని ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ తో కలిసి నటించిన సినిమా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ సహా, ప్రెస్ మీట్ జరగగా, ఆ ఈవెంట్ లో చాందిని చౌదరి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలాగే అందులో కొన్ని చిచ్చులేపే అంశాలు కూడా ఉన్నాయి. అది అంతపెద్ద ఇష్యూ కాకపోయినా, చిలికి చిలికి గాలి వాన అవుతుందంటారు కదా? అలాగే ఉంది ఈ అమ్మడి మాటలు. అయితే ఆ ప్రెస్ మీట్ లో ఓ విలేఖరి ఇప్పుడు IPL సీజన్ నడుస్తుంది కదా, మీ ఫెవరేట్ టీం ఏది అని అడిగాడు. దానికి చాందిని చౌదరి సమాధానమిస్తూ తాను ఇప్పటివరకు IPL మ్యాచ్స్ చూడలేదని CCL చూసాను కానీ, ఐపీఎల్ చూడలేదని ఒక్కసారి వచ్చి చూసి ఆ ఫీల్స్ లోని ఫెవరేట్ ని సెలెక్ట్ చేసుకుందామని చుస్తున్నానని అంది. హైదరాబాద్ ఉంది కదా అని అంటే… మాది ఆంధ్ర కదా మా ఆంధ్రకు టీమ్ లేదు అని పంచ్ కొట్టింది. ఈ మాటలు కొన్ని గంటల నుండి ట్రెండ్ అవుతున్నాయి.

రకరకాల ట్రోలింగ్ లు..

అయితే చాందిని చౌదరి సరదాగా ఆ పంచ్ వేసినట్టు తెలుస్తూనే ఉంది గాని, ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే చాందిని చౌదరి కామెంట్స్ ని గమనిస్తే.. తాజాగా ఎన్నికల జోరు నడుస్తుంది కాబట్టి అక్కడి గవర్నమెంట్ కి పంచ్ వేసిందని కొందరు అంటుంటే, మరి కొందరు సన్ రైజర్స్ అని తెలుగు టీం ఉండగా, ఆంధ్ర, తెలంగాణ అంటూ చిచ్చు లేపుతుందని సన్ రైజర్స్ టీం ఫాన్స్ మండిపడుతున్నారు. అయితే ప్రెస్ మీట్ లో అంతకు ముందే ఏదైనా సరదా సంభాషణ జరిగి ఉండవచ్చు, దానికి చాందిని కౌంటర్ వేసింది అని కూడా కొందరు అంటున్నారు. ఏది ఏమైనా సరదాకి అన్నా, నిన్న రాత్రి సన్ రైజర్స్ ఓ మ్యాచ్ లో ఓడిపోవడంతో చాందిని చౌదరి వీడియో ట్రెండ్ అయి ట్రోల్ అవుతుంది. ఇక చాందిని చౌదరి నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి మే 31న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు