Game Changer : ఆరోజే నెక్ట్ షెడ్యూల్.. చెన్నైలో… ప్రీ క్లైమాక్స్ ఆ ముగ్గురి మధ్యలో..

Game Changer : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ పాన్ ఇండియా చిత్రాల్లో “గేమ్ ఛేంజర్” ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు మూడేళ్ళుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ నెమ్మదిగా సాగుతుంది. ఒకానొక సమయంలో లాస్ట్ ఇయర్ లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా, అనుకోకుండా శంకర్ ఆగిపోయిన ఇండియన్ 2 ప్రాజెక్ట్ మళ్ళీ పట్టాలెక్కడంతో గేమ్ ఛేంజర్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఇక టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోల ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు ఆయా హీరోల సినిమాల నుండి అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషిలో ఉంచుతున్నారు. కానీ ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం రెండేళ్లుగా బాగా డల్ అయ్యారు. RRR తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా ఇప్పటివరకు రాలేదు. ఆచార్య లో స్పెషల్ అప్పీరెన్స్ కాగా, అది కూడా ఆ టైం లోనే రిలీజ్ అయింది. కానీ ఇప్పటివరకు ఒక్క ఫస్ట్ లుక్, ఒక సాంగ్ తప్ప ఏమి రాలేదు. ఇక ఫస్ట్ సాంగ్ వచ్చి కూడా నెల పైనే అయింది. కానీ ఇప్పటివరకు మరో న్యూస్ లేదు అని ఫ్యాన్స్ అనుకోగా, తాజాగా గేమ్ ఛేంజర్ కి సంబంధించి అప్డేట్ వచ్చింది.

చెన్నైలో ఆ ముగ్గురి మధ్య వార్..

అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ నెక్స్ట్ షెడ్యూల్ చెన్నై లో మే 1 నుండి జరుగనుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు, నవీన్ చంద్ర, సునీల్ ల మధ్య కీలకమైన సీన్లు ఉంటాయట. బహుశా ఇది ప్రీ క్లైమాక్స్ సీన్ ఉండొచ్చని అంటున్నారు. ఇక ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆల్మోస్ట్ 85 శాతం పూర్తయిందని, వార్తలు వస్తున్నాయి. అయితే ఇండియన్ 2 రిలీజ్ అయ్యాకే గేమ్ ఛేంజర్ (Game Changer) షూటింగ్ పై క్లారిటీ వస్తుందని అంటున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా ఈ మధ్యనే ప్రీ క్లైమాక్స్ కి ముందు ఓ భారీ ఫైట్ సీన్ చిత్రీకరణ జరిగిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఫైట్ సీన్ లో దాదాపు 1000 మందితో రామ్ చరణ్ తో ఫైట్ సీన్ ని చిత్రీకరించారట. ఫైట్ కూడా చాలా రియాల్సిటిక్ లా ఉంటుందని చిత్ర యూనిట్ నుండి సమాచారం వచ్చింది.

టీజర్ ఎప్పుడు?

అయితే గేమ్ ఛేంజర్ నుండి అప్డేట్స్ సమయానికి రావట్లేదు గాని లీకులు మాత్రం దండిగా వస్తున్నాయి. ఇప్పటివరకు ఏ బడా సినిమాకు ఇన్ని గేమ్ ఛేంజర్ కి అయిన లీక్స్ కాలేదని నెటిజన్లు అంటున్నారు. ఇదిలా ఉండగా గేమ్ ఛేంజర్ నుండి ఇప్పటివరకు ఫస్ట్ లుక్, ఒక సాంగ్ తప్ప మరే ప్రమోషనల్ ప్రోమో రాలేదు. ఇప్పుడైనా టీజర్ రిలీజ్ చేయమని ఫ్యాన్స్ దిల్ రాజు ని రిక్వెస్ట్ లు చేసి చేసి అలసిపోతున్నారు. అయితే గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని తాజా సమాచారం. రిలీజ్ డేట్ ని మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు మేకర్స్. పైగా షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని దిల్ రాజు అంటూనే, శంకర్ నుండి కన్ఫర్మేషన్ రాగానే రిలీజ్ డేట్ ప్రకటించేస్తామని అంటున్నాడు. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ మేకర్స్ నుండి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చరణ్ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 31 న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా సినిమా నుండి ఒక టీజర్ వస్తే గాని ఫ్యాన్స్ సంతృప్తి పడేలా లేరు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు