Ruhani Sharma : చీరలో కాకరేపుతున్న రుహాని…

Ruhani Sharma : టాలీవుడ్ హీరోయిన్ రుహాని శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్ల కింద సుశాంత్ తో కలిసి తొలి సినిమా ‘చిల‌సౌ’ లో నటించగా, ఫస్ట్ సినిమాతోనే ట్యాలెంటెడ్ బ్యూటీ అనిపించింది. త్రివిక్ర‌మ్ లాంటి దిగ్గ‌జంతో సైతం రిలీజ్ కి ముందే ప్రోమోల‌తోనే ప్ర‌శంస‌లందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. రొటీన్ కి భిన్నంగా నటనకు స్కోప్ ఉన్న పాత్రలు సెలెక్ట్ చేసుకోవడం ఈ అమ్మడికి ఒక రకంగా ప్లస్ అయింది. అందుకే పలు సినిమాలు ప్లాప్ అయినా ఈ అమ్మడి కి మంచి ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్ గా సైంధ‌వ్, ఆప‌రేష‌న్ వాలెంటైన్ లాంటి సినిమాలలో నటించింది . ఆ సినిమాలు ప్లాప్ అయినా రుహానీ శర్మకు మంచి పాత్రలు రావడంతో తన వ‌ర‌కూ పాస్ అయిపోయింది. ఇక రీసెంట్ గా ‘శ్రీరంగ నీతులు, అనే సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చింది. అందులో కూడా న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న రోల్ కావ‌డంతో సినిమా ఫ‌లితం ఎలా ఉన్న‌ప్ప‌టికీ నెగిటివ్ ఇంప్రెష‌న్ అయితే ప‌డ‌లేదు.

ఫోటో షూట్లతో రచ్చ..

అయితే కెరీర్ ప‌రంగా రుహానీకి ఇంకా మంచి భ‌విష్య‌త్ క‌నిపిస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ లోనే రుహానీ శర్మకి బాగా ఆఫర్లు వస్తున్నాయి. ఎంతో టాలెంట్ ఉన్న ఈ నటి అందంలోనూ రుహానీ త‌క్కువేం కాదు. ఎప్ప‌టి క‌ప్పుడు వేడెక్కించే ఫోటో షూట్ల‌తో కుర్ర‌కారుని అల‌రిస్తూనే ఉంటుంది. హాట్ భంగిమ‌ల‌తో యువ‌త అటెన్ష‌న్ డ్రా చేస్తుంది. ఇవ‌న్నీ ఒక ఎత్తైతే చీరందంలో సంథింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవ్వ‌డం రుహానీ ప్ర‌త్యేక‌త అని చెప్పాలి. చాలా ఫోటోషూట్లు చీరలోనే ఉంటాయి. ఈ అమ్మ‌డి ఇన్ స్టా చెక్ చేస్తే చీరలో భంగిమ‌లు కుప్ప‌లుగా ద‌ర్శ‌న‌మిస్తాయి. రంగు రంగుల చీర‌లో, లంగావోణీలో హోయ‌లు పోయిన తీరు చూస్తే మ‌తి పోవాల్సిందే. తాజాగా మ‌రోసారి చీరందంలో వ్వాటే బ్యూటీ అనిపించింది రుహని.
లేటెస్ట్ గా చేసిన ఫోటోషూట్లలో న‌లుపు రంగు చీర, ర‌విక‌లో అమ్మ‌డు త‌న‌లో బ్యూటీని మ‌రోసారి హైలైట్ చేసింది. క్లోజ‌ప్ షాట్ లో రుహానీ హాట్ ట్రీట్ కి ప‌డిపోవాల్సిందే. ఆ ఫొటోల్లో మ‌త్తెక్కించే చూపుల‌తో హృద‌యాల్ని కొసేస్తుంది. అలా క్లీవేజ్ బ్యూటీతో కాక‌ రేపుతున్న రుహని సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటుంది.

టాలీవుడ్ పైనే ఫోకస్..

ఇక రుహాని శర్మ (Ruhani Sharma) నార్త్ బ్యూటీ నే అయినప్ప్పటికీ టాలీవుడ్ లోనే ఎక్కువ ఆఫర్లు అందుకుంటుంది. హిందీలో ఒకటి, మలయాళంలో ఒక సినిమా చేసిన రుహని మిగతా అన్ని సినిమాలు తెలుగులోనే చేసింది. పలు సినిమాలు ప్లాప్ అయినా నటనాపరంగా స్కోప్ ఉన్న పాత్రలే చేయడంతో ఈ అమ్మడికి మంచి పాత్రలైతే వస్తున్నాయని సమాచారం. ఇక ఒక్కోసారి సినిమాలతో ఖాళీగా ఉన్నా, ఫోటోషూట్లతో మాత్రం ఆక్టివ్ గా ఉంటూ కిక్కెక్కిస్తోంది. ఇక రుహని ఫోటీషూట్లు కూడా ఎక్కువగా సౌత్ కల్చర్ కి తగ్గట్టు ఉంటాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు