Samantha Upcoming Movie : ఫైనల్‌గా మన “బంగారం” వచ్చేస్తోంది… డబులు సర్ప్రైజ్‌తో !

Samantha Upcoming Movie : దాదాపు 10 నెలల గ్యాప్ తర్వాత సమంత కెమెరా ముందుకు రావడానికి రెడీ అయిపోతుంది. మయోసైటీస్ కారణంగా, చికిత్సం కోసం 6 నెలలు ఇండస్ట్రీకి దూరంగా ఉంటానని ప్రకటించిన సమంత… ఫైనల్‌గా కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. తన పుట్టిన రోజు సందర్భంగా సమంత నుంచి రాబోతున్న సినిమాకు సంబంధించిన పోస్టర్ ను ఇన్ స్టాగ్రామ్ వేదికగా అనౌన్స్ రిలీజ్ చేసింది.

సమంత చేస్తున్న కొత్త మూవీ టైటిల్ “మా ఇంటి బంగారం”. ఈ పోస్టర్‌లో సమంత చీర కట్టుకుని, పద్దతిగా నుదిటికి బొట్టు, మెడలో తాళి బొట్టు వేసుకుని కనిపిస్తుంది. కానీ, ఇంత పద్దతిగా ఉండి చేతిలో గన్ ఎందుకు పట్టుకుందో అనే క్యూరియాసిటీ వచ్చేస్తుంది ఈ పోస్టర్ ను చూస్తుంటే. అలాగే సమంత ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ… “బంగారమయం కావాలంటే, అన్ని మెరవాల్సిన అవసరం లేదు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ క్యాప్షన్ తో కూడా సినిమాపై ఇంట్రెస్ట్ పెరగుుతంది.

అయితే, ఈ మూవీ కూడా లేడీ ఓరియెంటెడ్ అని తెలుసిపోతుంది. కాగా, సమంత చివరి సినిమా ఖుషి కంటే ముందు.. యశోద, శాకుంతలం లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

అలాగే, ఈ సినిమాతో సమంత కమ్ బ్యాక్ ఇవ్వడమే కాదు, ప్రొడ్యూసర్ గా కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. సామ్ ఇటీవల “త్రాలల మూవీంగ్ పిక్చర్స్” అనే పేరుతో ఒక నిర్మాణ సంస్థను సమంత స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థ ఫస్ట్ మూవీగా ఈ మా ఇంటి బంగారం రాబోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు