Sonu sood: 61 గంటల వరకు ఆగిన వాట్సప్.. ఆవేదన వ్యక్తం చేస్తున్న సోనూసూద్..!

Sonu sood.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, రియల్ హీరోగా పేరు దక్కించుకున్న సోనూ సూద్.. తన వాట్సప్ 36 గంటలుగా పని చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. చాలా మంది కష్టాల్లో ఉన్నవారు వాట్సాప్ లో తనను కాంటాక్ట్ అవుతారని , నా వాట్సప్ పనిచేయకపోవడంతో వారంతా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని.. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.. అయితే తమ సమస్యను వెంటనే చక్కదిద్ధాలంటూ వాట్సప్ ని కూడా ట్యాగ్ చేశారు.. అయితే తాజాగా 61 గంటల తర్వాత తన వాట్సప్ పనిచేస్తోందని మళ్లీ ఆయన ఎక్స్ ద్వారా రీ రిలీజ్ ట్వీట్ చేశారు.. వాట్సప్ పునరుద్ధరించబడిన తర్వాత 61 గంటల్లోనే 9483 మెసేజ్లు వచ్చాయని స్పష్టం చేశారు.. ముఖ్యంగా సహాయం కోసం చాలామంది తనను వాట్సప్ ద్వారా కాంటాక్ట్ చేస్తున్నారని.. వారందరికీ తాను అండగా ఉండాలని.. అందుకే దయచేసి వాట్సప్ సమస్య మళ్ళీ రాకుండా చేయాలని కూడా కోరారు. ఇదివరకే తన వాట్సప్ పనిచేయడం లేదని.. ఎన్నోసార్లు సోనూసూద్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే ఈసారి వాట్సాప్ ను ట్యాగ్ చేస్తూ మళ్ళీ సమస్య రాకుండా చూడాలని కోరారు.

Sonu sood: WhatsApp stopped for 61 hours.. Sonu sood is expressing his grief..!
Sonu sood: WhatsApp stopped for 61 hours.. Sonu sood is expressing his grief..!

సోనూసూద్ సినిమాలు..

ఇకపోతే ప్రస్తుతం సోనూసూద్ ఫతే అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటిస్తోంది.. ఇకపోతే సోనూసూద్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కూడా ఇదే.. శక్తి సాగర్ ప్రొడక్షన్లో జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కబోతోంది.. హాలీవుడ్ స్టంట్ నిపుణుడు లీ విట్టేకర్ పర్యవేక్షణలో ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను కూడా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఏడాది చివర్లో ఫతే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సోనూసూద్ కెరియర్..

తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. పంజాబ్ లోని మోగ అనే పట్టణంలో జన్మించారు… అనేక నాటకాలలో కూడా పనిచేశారు.. ఇక తెలుగులో అరుంధతి చిత్రంతో విలన్ గా పరిచయమై.. ఈ సినిమాతో ఉత్తమ ప్రతి నాయకుడిగా నంది అవార్డును కూడా సొంతం చేసుకోవడం జరిగింది..

- Advertisement -

రీల్ హీరో కాదు రియల్ హీరో..

గత నాలుగు సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కుదిపేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా భారతదేశంలో కరోనా వ్యాప్తి సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు.. దాంతో వివిధ ప్రదేశాలలో చిక్కుకున్న వారిని సొంత ఖర్చులతో వారి ఊర్లకు పంపించడం, ఆక్సిజన్ కొరత ఉన్న చోట సిలిండర్లు సమకూర్చడం, ఉపాధి కోల్పోయిన వారికి బ్రతుకు తెరువు చూపించడం లాంటి చర్యలతో రీల్ హీరో కాస్త రియల్ హీరోగా పేరు దక్కించుకున్నారు.

సోనూసూద్ వ్యక్తిగత జీవితం..

మోగ అనే పట్టణంలో జన్మించిన ఈయన నాగపూర్ లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ గా పనిచేశారు. ఆ తర్వాత మోడలింగ్ , ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ కూడా చేసేవారు.. అప్పుడే సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక మరింత బలమైంది.. ఒక నెల రోజులు నటనలో శిక్షణ తీసుకున్నారు.. తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సత్తా చాటుతూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక 1996లో మహారాష్ట్రలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన మహిళ సోనాలిని వివాహం చేసుకోగా, వీరికి ఇద్దరు కుమారులు కూడా జన్మించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు