Sahil Khan: మరో బెట్టింగ్ యాప్ కేసులో యంగ్ నటుడు..!

Sahil Khan.. తాజాగా మరో బెట్టింగ్ యాప్ కేసులో ఒక యంగ్ నటుడు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయానికి వెళ్తే.. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ ను తాజాగా ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చత్తీస్ ఘఢ్లో ప్రత్యేక దర్యాప్తు బృందం ఈయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు సాహిల్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను బాంబే హైకోర్టు తిరస్కరించగా.. ఇప్పుడు ఆయనను అరెస్టు చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Sahil Khan: Young actor in another betting app case..!
Sahil Khan: Young actor in another betting app case..!

మహదేవ్ బెట్టింగ్ యాప్ సహా యజమానిగా..

ఈ బెట్టింగ్ కేసు ఏంటి ? సాహిల్ ను ఎందుకు అరెస్టు చేశారు? అనే విషయానికి వస్తే.. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ ను సైబర్ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం కస్టడీలోకి తీసుకుంది. సాహిల్ కి ప్రత్యేక దర్యాప్తు బృందం 2023 డిసెంబర్లోనే సమన్లు జారీ చేసింది.. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేస్ లో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఒక సెలబ్రిటీ గా కేవలం ఆ యాప్ కు బ్రాండ్ ప్రమోటర్ గా మాత్రమే చేశానంటూ తెలియజేశారు.

బెయిల్ నిరాకరణ..

అంతేకాకుండా ఒప్పందం కూడా 2022 ఫిబ్రవరి నెలలో కుదిరినట్లుగా వెల్లడించారు సాహిల్..అయితే ఆ యాప్ ద్వారా జరిగేటువంటి ఎలాంటి కార్యక్రమాలకు కూడా తనకు సంబంధం లేదంటూ కూడా పిటిషన్ లో వెల్లడించారు.. అయితే పోలీసులు మాత్రం అతన్ని బెట్టింగ్ యాప్ సహా యజమానిగా చెబుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంలో సాహిల్ ఖాన్ ను విచారించిన హైకోర్టు బెయిల్ నిరాకరిస్తూ పలు రకాలు ఉత్తర్వులను కూడా జారీ చేసిందట. బెట్టింగ్ యాప్ కార్యక్రమం అక్రమమని.. చాలా పెద్ద మొత్తంలో డబ్బులు మారాయని.. కేవలం నకిలీ బ్యాంకుల ఖాతాలను సృష్టించి.. దొంగ సిమ్ కార్డులతో ఇలాంటి సంప్రదింపులు చేశారనే విధంగా పిటిషన్ దారులకు సెక్షన్ 247 ప్రకారం నేరుగా సంబంధం ఉన్నట్లు తెలియజేసింది కోర్టు.

- Advertisement -

మహదేవ్ బెట్టింగ్ యాప్ లో వేల కోట్ల దందా..

పలు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్న సాహిల్ ఖాన్ బాగా గుర్తింపు సంపాదించారు.. ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్ గా కూడా ఉన్నారు. అయితే ఎఫ్ ఐ ఆర్ లో తెలిపిన వివరాల ప్రకారం మహాదేవ్ బెట్టింగ్ యాప్స్ ద్వారా దాదాపుగా 15,000 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లుగా గుర్తించారట. ఇందులో 67 బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్ యాప్ లను కూడా సృష్టించి ఫుట్బాల్, క్రికెట్ ఇతరత్రా ఆటలలో కూడా బెట్టింగ్ వంటివి నిర్వహించారని తెలియజేశారు. సామాన్యులను ఆకర్షించేందుకే సెలబ్రిటీలు సైతం ప్రమోట్ చేస్తూ ఉన్నారని ప్రకాష్ బంకర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మాతంగ పోలీస్ స్టేషన్లో కేసు..

2023లో మాతంగ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనటువంటి .. ఈ కేసు వల్ల రవి అనే వ్యక్తిని, ఉప్పల్ ను దుబాయిలో పోలీసులు పట్టుకున్నారట. అక్కడ విచారించిన తర్వాత నకిలీ పత్రాలతో 2000 భోగస్ సిమ్ములు,1,700 బ్యాంకు ఖాతాలు తీసినట్లుగా వెల్లడించారు. అయితే ఇలా వచ్చిన డబ్బులను సైతం హవాలా, క్రిష్టో వంటి కరెన్సీ రూపంలో విదేశాలకు పంపిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరబ్ చంద్రకర్ పెళ్లి విదేశాలలో చాలా గ్రాండ్ గా జరిగిందని. అందుకోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం .. ఈ వివాహానికి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారని ఈడి అధికారులు గుర్తించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు