Ravi Teja: రవితేజ భార్య బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే

Ravi Teja: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది కష్టపడి వస్తే… మరి కొంతమంది బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో రాణిస్తారు. అయితే కష్టపడి వచ్చినవారు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత మాస్ మహారాజు రవితేజ ఉన్నాడు. మాస్ మహారాజు రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేసి…. ఆ తర్వాత ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా మారిపోయాడు రవితేజ. రవితేజ కెరీర్ ను పవన్ కళ్యాణ్ సినిమాలే మార్చాలని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అలాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ కు మొదట వచ్చాయి. అవి రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాలన్నీ రవితేజ చేసి సక్సెస్ అయ్యాడు. ఇలా దాదాపు ఇండస్ట్రీలో 60కి పైగా సినిమాలు చేసి మాస్ మహారాజుగా పేరు తెచ్చుకున్నాడు రవితేజ.

అయితే తాజాగా రవితేజ భార్య గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రవితేజ భార్య పేరు కళ్యాణి. ఆమెను 2002 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాలో పెళ్లి చేసుకున్నాడు రవితేజ. అయితే రవితేజ భార్య తన స్వయాన మేనమామ కూతురు. కళ్యాణి కండ్రి రవితేజ తల్లి రాజ్యలక్ష్మి ఇద్దరు అక్క తమ్ముళ్లు. చుట్టాల అమ్మాయిని రవితేజ పెళ్లి చేసుకున్నాడు అన్నమాట. కాగా రవితేజకు ఒక పాప ఒక బాబు ఉన్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు