Pawan Kalyan: గాజు గ్లాస్‌ కు ఓటేయని పవన్‌ కళ్యాణ్‌ ?

Pawan Kalyan:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. దీంతో జనాలందరూ ఓటు వేసేందుకు క్యూ లైన్ లో ఉన్నారు. ఇవాళ ఎండ తీవ్రత కూడా తగ్గడంతో జనాలందరూ ఓటు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

బెంగళూరు అలాగే హైదరాబాద్ నగరాల్లో ఉన్న ఏపీ ఓటర్లు అందరూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఊహించని పరిణామం ఎదురయింది. ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు ఓటు హక్కు లేదు.

దీంతో మంగళగిరి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్, అతని మూడవ భార్య అన్నా లెజీనోవ ఓటు వేశారు. ఈ ఇద్దరికీ మంగళగిరిలోనే ఓటు హక్కు ఉంది. మంగళగిరిలో పార్టీ ఆఫీస్ ఉండటంతో… ఇక్కడే ఓటు హక్కు నమోదు చేయించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈ తరుణంలోనే… తన నియోజకవర్గంలో తన గ్లాస్ గుర్తుకు పవన్ కళ్యాణ్ ఓటు వేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఇదే అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. Pawan Kalyan did not vote for Gaju Glass

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు