Samantha: అతని కోసం ఫ్రీగా సినిమా చేసిన సామ్ ?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంతకు ఉన్న క్రేజ్ అంతా కాదు. గత 14 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని దున్నేస్తోంది సమంత. ఎక్కడ చూసినా సమంత సమంత… ఈ పేరే వినిపిస్తుంది. 14 సంవత్సరాల కిందట ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది సమంత. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్ గా నటించారు.

ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో… వెనక్కి చూసుకోలేదు హీరోయిన్ సమంత. అయితే తాజాగా హీరోయిన్ సమంత గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ఒక సినిమాకు ఒక రూపాయి తీసుకోలేదట రెమ్యూనరేషన్. ఆ సినిమానే యు టర్న్. ఈ సినిమాకు పవన్ కుమార్ దర్శకత్వం వహించారు.

నిర్మతగా శ్రీనివాస చిత్తూరి, రాంబాబు బండారు వ్యవహరించారు. ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా తెలుగు, తమిళ్ భాషలో రిలీజ్ చేశారు. అయితే జనాలకు ఈ కథ నచ్చకపోవడంతో సినిమా అట్టర్ ప్లాఫ్ అయింది. అయితే ఈ సినిమాకు సమంత డబ్బులు తీసుకోకుండానే చేసిందట. కాగా ప్రస్తుతం సమంత మయో సైటీస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోలుకుంటుంది సమంత.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు