Pooja Hegde: ఆ హీరోతో తిరుగుతున్న పూజా ?

Pooja Hegde: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది తక్కువ సమయంలో పాపులర్ అవుతుంటే.. మరి కొంతమంది హీరోయిన్లు చాలా టైం తీసుకుని హిట్ అవుతున్నారు. ఇక మరి కొంతమంది హీరోయిన్లు సక్సెస్ అయిన తర్వాత… సినిమా అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఒకరు. హీరోయిన్ పూజ హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముకుందా మరియు ఒక లైలాకోసం లాంటి సినిమాలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టింది పూజ హెగ్డే. ముకుంద సినిమాలో చాలా సాంప్రదాయబద్ధంగా తెలుగు హీరోయిన్ గా మెరిసింది.

అయితే తర్వాత ఆమె చేసిన ప్రతి సినిమాలో పోట్టి బట్టలు వేసుకొని అందరినీ కనువిందు చేసింది. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజ హెగ్డే టాప్ మోస్ట్ హీరోయిన్గా కొన్ని రోజులు కొనసాగింది. బుట్టబొమ్మ పూజ హెగ్డే ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు లేక కష్టాల్లో ఉంది పూజా హెగ్డే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమానే లాస్ట్ హిట్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేసింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది.

ఈ సినిమా తర్వాత ఆమెకు ఏ సినిమా కలిసి రాలేదు. మెగా హీరో బన్నీ, అఖిల్ అలాగే అక్కినేని నాగచైతన్య లాంటి టాప్ హీరోల సినిమాలలో కూడా నటించింది హీరోయిన్ పూజ హెగ్డే. ముఖ్యంగా హీరోయిన్ పూజ హెగ్డేకు అల్లు అర్జున్ సినిమాలతోనే మంచి పాపులారిటీ వచ్చింది. అల్లు అర్జున్ మరియు పూజ హెగ్డే కాంబినేషన్లో అలా వైకుంఠపురంలో, డీజే లాంటి బంపర్ హిట్ సినిమాలు వచ్చాయని చెప్పవచ్చును. అయితే అలా వైకుంఠపురం సినిమా తర్వాత హీరోయిన్ పూజ హెగ్డేకి ఇండస్ట్రీలో ఒక్క హిట్ కూడా లేదు. ఇది ఇలా ఉండగా….గుంటూరు కారం సినిమాలో కొన్ని సీన్స్ చేసిన తర్వాత కూడా హీరోయిన్ పూజ హెగ్డేను తప్పించారు. అంతలా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ పూజ హెగ్డేకు వ్యతిరేకత ఉంది.

- Advertisement -

అయితే.. తాజాగా హీరోయిన్‌ పూజా హెగ్డే గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్‌ వైరల్‌ గా మారింది. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్‌ హీరోతో హీరోయిన్‌ పూజా హెగ్డే బాగా తిరుగుతుందట. వారిద్దరూ చాలా ప్రదేశాల్లో తిరిగారట. దీంతో ఆ హీరోతో హీరోయిన్‌ పూజా హెగ్డే రిలేషన్‌ షిప్‌ లో ఉన్నట్లు తమిళ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. అయితే.. తనకు ఆ హీరో స్నేహితుడి లాంటివాడని హీరోయిన్‌ పూజా హెగ్డే స్పష్టం చేసిందట. ఇప్పుడు ఇదే వార్త వైరల్‌ అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు