Mamitha Baiju: ఏకంగా స్టార్ హీరోతో తెలుగు ఎంట్రీ.. సక్సెస్ రేటెంతో..?

Mamitha Baiju.. మలయాళం ప్రేమలు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మమిత బైజు మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకుంది. హీరో కంటే ఎక్కువగా తన నటనతో మెప్పించి.. భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ ఒక్క సినిమా సక్సెస్ తో ఈమె ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది.. నిజానికి ఈమె కొత్త హీరోయిన్ కాదు ప్రేమలు సినిమా కంటే ముందే ఏకంగా 10 చిత్రాలలో నటించింది.. అందులో కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా ప్రేక్షకులను మెప్పించింది.. కానీ ఆ సినిమాలేవి కూడా ఈమెకు అంతగా గుర్తింపును తీసుకురాలేదు.. ఒక ప్రేమలు సినిమా మాత్రం ఈమెను ఓవర్ నైట్ లోనే స్టార్ ను చేసింది అనడంలో సందేహం లేదు.. ఈ ఒక్క సినిమాతో మలయాళం లోనే కాదు తెలుగులో కూడా మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.. మలయాళం నుంచి తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

స్టార్ హీరో సరసన తెలుగు ఎంట్రీ..

Mamitha Baiju: Telugu entry with star hero together.. with success rate..?
Mamitha Baiju: Telugu entry with star hero together.. with success rate..?

ముఖ్యంగా అటు మలయాళం ఇటు తెలుగు ప్రేక్షకులు మమిత పెర్ఫార్మెన్స్ కి దాసోహం అయిపోయారు.. టాలీవుడ్ లో కూడా ఈమెకు మంచి ఇమేజ్ ఏర్పడింది.. ఈ నేపథ్యంలోనే ఈమెకు చాలామంది తెలుగు నిర్మాతలు అవకాశం ఇస్తామంటూ సంప్రదిస్తున్నట్లు సమాచారం.. ఇక అందులో భాగంగానే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న చిత్రంలో హీరోయిన్ గా ఈమె అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.. నిజానికి ఇందులో శ్రీ లీలా హీరోయిన్ గా నటిస్తోంది అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే..కానీ కొన్ని కారణాలవల్ల ఆమె తప్పుకోవడంతో వేరే హీరోయిన్ ని వెతుకుతున్న క్రమంలో ఈ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మమితాబైజుని నిర్మాతలు ఫిక్స్ చేసినట్లు సమాచారం.

వారిలా స్టార్ స్టేటస్ అందుకుంటుందా..

ఇప్పటికే పలు మలయాళం చిత్రాలలో నటించిన ఎంతోమంది హీరోయిన్లు ఇప్పుడు తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకొని దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. అలాంటి వారిలో కీర్తి సురేష్ , అనుపమ పరమేశ్వరన్ లాంటి హీరోయిన్స్ ఇప్పటికే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు మరి వీరిలా మలయాళం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న మమితాబైజు రౌడీ హీరో సరసన నటించి ఏ విధంగా తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంటుందో చూడాలి..

- Advertisement -

మమిత బైజు కెరియర్..

కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూరులో డాక్టర్ బైజు కృష్ణన్, మినీ బైజు దంపతులకు జన్మించిన ఈమెకు మిథున్ బైజు అనే అన్నయ్య కూడా ఉన్నారు.ప్రస్తుతం కొచ్చిలోని సేక్రేడ్ హార్ట్ కాలేజీ నుండి సైకాలజీలో బీఎస్సీ డిగ్రీ చదువుతోంది ఈ ముద్దుగుమ్మ. మొదటిసారి సర్వోపరి పాలక్కారన్ అనే చిత్రం ద్వారా 2017 లో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మెప్పించింది. ఖో ఖో చిత్రంలో తన నటనకు ఉత్తమ సహాయ నటిగా కేరళ ఫిలిం క్రిటిక్స్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ప్రేమలు సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. మరొకవైపు ఒక తమిళ సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు