Kamal Hassan (Thug life): 2 గంటల్లోనే పూర్తీ.. ఇది కదా టాలెంట్ అంటే..?

Kamal Hassan.. నేటితరం హీరోలతో పోల్చుకుంటే నాటితరం హీరోలలో ఎన్నో టాలెంట్స్ అప్పుడప్పుడు బయటకి వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే 24 క్రాఫ్ట్స్ పైన సీనియర్ హీరోలకు మంచి పట్టు ఉంది. అందులో భాగంగానే అప్పుడప్పుడు వారి టాలెంట్స్ బయట పెడుతూ అభిమానులను ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే విశ్వ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమలహాసన్ తాను నటిస్తున్న థగ్ లైఫ్ కోసం హీరో కాస్త లిరిసిస్ట్ గా మారిపోయారు. నిజానికి కమలహాసన్ కి సినీ ఇండస్ట్రీలో ఉండే మొత్తం 24 క్రాఫ్ట్స్ పై మంచి పట్టు ఉంది.. నటుడు గానే కాకుండా నిర్మాతగా , స్క్రీన్ రైటర్ గా , దర్శకుడిగా, డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఇలా చాలా రంగాలలో ఆయన సత్తా చాటారు. 35 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.. అదే థగ్ లైఫ్.. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారుతోంది.

Kamal Hassan (Thug life): Completed in 2 minutes.. this is the talent..!
Kamal Hassan (Thug life): Completed in 2 minutes.. this is the talent..!

రెండు గంటల్లోనే పాట పూర్తీ..

కమలహాసన్ ఈ చిత్రంలో ఒక పాటకు లిరిక్స్ రాశారు.. అంతేకాకుండా ఈ పాటను రాయడానికి.. కంపోజ్ చేసి, రికార్డు చేయడానికి ఆయనకు కేవలం రెండు గంటలు మాత్రమే సమయం పట్టడం మరో విశేషం.. తమిళంలో ఇప్పటికే కొన్ని పాటలు స్వయంగా రాసి.. పాడిన కమలహాసన్.. ఇప్పుడు ఏకంగా రెండు గంటల్లోనే పాటకు లిరిక్స్ అందించడమే కాదు కంపోజ్ చేసి రికార్డు చేయడం ఇదే మొదటిసారి.. ఈ గొప్ప టాలెంటు తెలిసి అభిమానులే కాదు సెలబ్రిటీలు, సినీ ప్రేక్షకులు కూడా కమల్ హాసన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

థగ్ లైఫ్ సినిమా విశేషాలు..

కమలహాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమలహాసన్, మణిరత్నం , ఆర్. మహేంద్ర , శివ అనంతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష, శింబు కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో జయం రవి, దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నారంటూ వార్తలు వినిపించాయి.. ఆ తర్వాత కొన్ని రోజులకు దుల్కర్ సల్మాన్ సినిమా నుంచి బయటకు వచ్చేసారని సమాచారం.. అలాగే ఇటీవల ఈ సినిమా నుంచి జయం రవి కూడా బయటకు వచ్చారని తెలుస్తోంది.. అయితే డేట్స్ విషయంలో కాస్త క్లాష్ రావడం వల్లే జయం రవి పక్కకు తప్పుకున్నారని సోషల్ మీడియాలో వార్త జోరుగా ప్రచారం అవుతోంది. అయితే ఈ వార్తలపై అటు చిత్ర బృందం కానీ ఇటు ఈ హీరోలు కానీ ఎవరూ స్పందించలేదు.. దీంతో ఈ సినిమాలో జయం రవి, దుల్కర్ సల్మాన్ ఉన్నారా? లేదా? అనే విషయంపై అభిమానులలో గందరగోళం కొనసాగుతోంది. మరోవైపు దుల్కర్ ప్లేస్ లోనే శింబు ను తీసుకున్నారు అంటూ అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు. ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్లు వార్తలు రాసుకుంటున్న నేపథ్యంలో సినిమాపై పూర్తి సమాచారం చిత్ర బృందం ఇచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు