Adavi Simhalu: అడవి సింహాలకు 41 ఏళ్ళు

Adavi Simhalu: తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు, హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఇతర భాషల హీరోయిన్లు అలాగే హీరోలు కూడా ఉంటారు. ముఖ్యంగా.. మన తెలుగు హీరోలు మాత్రం ఎక్కువ శాతం ఇక్కడి వారే ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఆనాటి కాలంలో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏలేవారు. అలాంటి వారిలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు మరియు శోభన్ బాబు లాంటి వారు ఉండేవారు.

అయితే ఈ స్టార్ హీరోలు అందరూ డబుల్ రోల్లో కూడా చేశారు. ఒకే సినిమాలో నలుగురు హీరోలు ఉన్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇలా డబుల్ రోల్ లో చాలామంది హీరోలు… చాలా రకాల సినిమాలు చేశారు. ఇందులో క్రైమ్, రొమాంటిక్, ప్రేమ కథ చిత్రాలు, సెంటిమెంట్ సినిమాలు, ఫ్యామిలీ ట్రాక్ ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో అడవి సింహాలు సినిమా ఒకటి.

అడవి సింహాలు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా 1983 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజున రిలీజ్ అయింది. అంటే ఈ అడవి సింహాలు రిలీజ్ అయి 41 సంవత్సరాలు పూర్తయింది అన్నమాట. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మరియు కృష్ణంరాజు హీరోలుగా నటించారు. అలాగే వీరి సరసన జయంప్రద మరియు శ్రీదేవి మెరిశారు. ఇద్దరు హీరోలకు ఇద్దరి హీరోయిన్లను సెట్ చేశారు దర్శకుడు రాఘవేంద్రరావు.

- Advertisement -
Adavi Simhalu

అప్పట్లోనే దర్శకుడు రాఘవేంద్రరావుకు మంచి పేరు ఉంది. అలాంటి రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించడం సినిమాకే హైలెట్గా నిలిచింది. 41 సంవత్సరాల కిందట రిలీజ్ అయిన ఈ సినిమాకు అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరించారు. దీనికి చక్రవర్తి మ్యూజిక్ అందించగా… వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా వచ్చింది.

అప్పట్లో రిలీజ్ అయిన అడవి సింహాలు సినిమా చాలా బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో యాక్షన్ అలాగే కుటుంబ సమేతంగా చూడదగ్గ సీన్లు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఇందులో రావు గోపాల్ రావు కోబ్రా కొండలరావు అనే పాత్ర చేసి అందర్నీ మెప్పిస్తాడు. అలాగే సత్యనారాయణ హరి పాత్రలో కనిపించారు. మొత్తానికి 40 సంవత్సరాల కిందట వచ్చిన ఈ సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు