Prabhas’s Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ సప్రైజ్..!

Prabhas’s Salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సలార్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28న రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజైన గ్లిమ్ప్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్న నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ సహా నార్మల్ ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి వరుస డిజాస్టర్స్ వచ్చిన నేపథ్యంలో సలార్ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. నిజానికి ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమాల్లో సలార్, కల్కి 2898AD సినిమాల మీదనే ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా పార్ట్1 ది సీజ్ ఫైర్ కి సంబంధించి ఆగస్టు 15న ఒక సప్రైజ్ అప్డేట్ ఉంటుందని ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఈ నేపథ్యంలో ఆ అప్డేట్ దేని గురించి ఉంటుందని ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. అయితే, టీజర్ అప్డేట్ కానీ, సాంగ్ అప్డేట్ కానీ ఉంటుందని కామెంట్స్ వస్తున్నాయి.

జగపతిబాబు విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తాయని, అంతే కాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా కీలకంగా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. మరి, ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రభాస్ కి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు