Prabhas’s Salaar: డైనోసర్ కే ఎదురెళ్తాడా? – ఆ డైరెక్టర్ కి గుణపాఠం తప్పదా..?

Prabhas’s Salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజిఎఫ్ సంచలనం ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న సలార్ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ 28న వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్లో రూపొందిన వ్యాక్సిన్ వార్ సినిమా కూడా రిలీజ్ సిద్ధంగా ఉండటం. ప్రభాస్ సినిమా రిలీజ్ రోజున వివేక్ దర్శకత్వం వహించిన సినిమా రిలీజ్ కావటం ఇది ఫస్ట్ టైమ్ కాదు. గతంలో రాధే శ్యామ్ సినిమా రిలీజ్ రోజునే కాశ్మీరీ ఫైల్స్ కూడా విడుదలైంది.

రాధేశ్యామ్ సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోగా, చిన్న సినిమాగా విడుదలైన కాశ్మీరీ ఫైల్స్ మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ సలార్ సినిమాకి పోటీగా వ్యాక్సిన్ వార్ సినిమా రిలీజ్ అవుతుండటంతో వివేక్ ప్రభాస్ ని టార్గెట్ చేస్తున్నాడా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే గతంలో వచ్చిన కాశ్మీరీ ఫైల్స్, ఇప్పుడు రిలీజ్ కానున్న వ్యాక్సిన్ సినిమాలను అధికార పార్టీ ప్రమోట్ చేస్తుండటం.

బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి వసరుస డిజాస్టర్స్ అందుకున్న ప్రభాస్ కి సలార్ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో సలార్ సినిమాపై రోజురోజుకీ హైప్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సారి ప్రభాస్ చేతిలో డైరెక్టర్ వివేక్ కి గుణపాఠం తప్పదని అంటున్నారు ఫ్యాన్స్. మరి, వివేక్ కాశ్మీరీ ఫైల్స్ హిట్ అయ్యిందన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో డైనోసర్ లాంటి సాలార్ కి ఎదురెళ్తాడా లేక పోటీ నుండి తప్పుకొని సేఫ్ అవుతాడా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు