Vishwak Sen Marriage Mystery: మొత్తానికి విశ్వక్ సేన్ పెళ్లి మిస్టరీ వీడింది

Vishwak Sen Marriage Mystery

గతకొద్దిరోజులుగా యంగ్ హీరో విశ్వక్ సేన్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న విశ్వక్ సేన్ ఇటీవలనే తన ఇంస్టాగ్రామ్ లో తన పెళ్లి వార్తను ఆయన అభిమానులతో షేర్ చేసుకోవడంతో విశ్వక్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త గతకొద్ది రోజులుగా నెట్ లో వైరల్ గా మారింది.

అయితే ఈ వార్త గురించి ముందునుంచే ఫిల్మీ ఫై క్లారిటీ ఇస్తూనే వచ్చింది. చివరికి ఫిల్మీ ఫై చెప్పిన మాటలే నిజం అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే యంగ్ హీరో విశ్వక్ సేన్ త్వరలోనే ఆహా  ఓటిటిలో ఒక ఫ్యామిలీ షో కి హోస్ట్ గా చేయబోతున్నాడు. “ఫ్యామిలీ ధమాకా” పేరుతో రాబోతున్న ఈ షో ప్రోమోను కాసేపటి క్రితం ఆహా విడుదల చేసింది.

నిజానికి ఈ షో ఒక అమెరికన్ టివి షో ను బేస్ చేసుకొని రాబోతుందని టాక్. దాదాపు 63 కంట్రీలలో సక్సెస్ ఫుల్ షోగా ప్రదర్శించబడి,  ప్రపంచవ్యాప్తంగా పాపులరైన ఈ ఫ్యామిలీ షో ను తెలుగులో ఆహా “ఫ్యామిలీ ధమాకా” పేరుతో హీరో విశ్వక్ సేన్ ను హోస్ట్ గా పరిచయం చేస్తూ ప్రేక్షకులకు అందించబోతుంది. అయితే ఈ రియాలిటీ షోలో సరదా, సరదా ఆటలు ఆడిస్తూ గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీని ఆహా అందించబోతుందని సమాచారం. త్వరలోనే ఈ షో కు సంబంధించిన మరిన్ని విషయాలను ఆహా ప్రేక్షకులతో పంచుకోనుంది.

- Advertisement -

ఇక విశ్వక్ సేన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన కృష్ణ చైతన్య డైరెక్షన్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన మొదటి సాంగ్ ఈ రోజు విడుదలైంది. కాగా ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో గామి అనే మరో సినిమా కూడా ఇటీవలనే షూటింగ్ కంప్లిట్ చేసుకుంది. అలాగే రవితేజ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ మరో సినిమా కూడా చేస్తున్నాడు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు