Leo latest glimpse out now: లియో సినిమా గ్లిమ్స్- లోకేష్ కనకరాజ్ ఆరాచకం

leo latest glimpse out now

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఇండియాస్ మోస్ట్ యాన్టిస్పెటెడ్ సినిమా లియో నుంచి కాసేపటి క్రితం గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ రోజు యాక్షన్ కింగ్ అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన బర్త్ డే స్పెషల్ గా మూవీ టీం యాక్షన్ కింగ్ అర్జున్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ గ్లిమ్స్ వీడియో చూస్తుంటే లియో సినిమాపై ప్రేక్షకులకున్న భారీ అంచనాలన్నింటిని నిజం చేసేలాగే కనిపిస్తోంది

తలపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలనే షూటింగ్ కంప్లిట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇక అర్జున్ గ్లిమ్స్ వీడియో విషయానికొస్తే లోకేష్ కనకరాజ్ స్టైల్ ఆఫ్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ లియో సినిమాలో కూడా పుష్కలంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. అర్జున్ ఈ సినిమాలో హారొల్ద్ దాస్ పాత్రలో కనిపించబోతున్నట్టు గ్లిమ్స్ ద్వారా తెలుస్తోంది. ఒక్కముక్కలో గ్లిమ్స్ వీడియో గురించి చెప్పాలంటే మాత్రం లోకేష్ కనకరాజ్ గత చిత్రమైన విక్రమ్ సినిమాలో బాగా పాపులరైన రోలెక్స్ పాత్రను గుర్తు తెచ్చే అంత పవర్ ఫుల్ గా ఈ గ్లిమ్స్ వీడియో ఉంది.

సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అర్జున్ దాస్, మిస్కిన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తోన్నలియో సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవబోతుంది. భారీ అంచనాల మధ్య మరియు బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రేక్షకులను మరి ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు