Akhil’s Next: ఇద్దరిదీ ఒకే స్థితి, ఏమిటి ఈ పరిస్థితి..?

Akhil’s Next

కెరీర్ స్టార్ట్ చేసిన నాటి నుండి ప్రతి సినిమా లాంచింగ్ లా ఫీల్ అవుతూ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు అక్కినేని అఖిల్. ఈ మధ్య అఖిల్ ఎన్నో హోప్స్ పెట్టుకున్న ఏజెంట్ సినిమా కూడా డిజాస్టర్ అవ్వటంతో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అఖిల్ కెరీర్లో కమర్షియల్ గా చెప్పుకోదగ్గ హిట్ ఏదైనా ఉందంటే అది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే, అఖిల్ మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవనుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం డిజాస్టర్స్ లో ఉన్న ఇద్దరు మళ్ళీ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనున్నారని వస్తున్న టాక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత ఈ సారి ఎలా అయినా బ్లాక్ బస్టర్ అందుకోవాలని కసి మీదున్న అఖిల్ యువీ క్రియేషన్స్ లో ధీర అనే సినిమా స్టార్ట్ చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఈ సినిమా గురించి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేనప్పటికీ ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అని సమాచారం అందుతోంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరును అఖిల్ సజెస్ట్ చేసాడని సమాచారం అందుతోంది.

ధీర సినిమాతో పాటు అఖిల్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో మరో సినిమా కమిట్ అయ్యాడని తెలుస్తోంది. ధీర సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాలతో చేయబోయే సినిమాపై దృష్టి పెట్టె ఛాన్స్ ఉంది. మరో పక్క తెలుగులో గుంటూరు కారం రూపంలో ఉన్న ఒకే ఒక్క ఆఫర్ కూడా చేజారిన నేపథ్యంలో అయోమయంలో ఉన్న పూజా హెగ్డేకి ఈ సినిమా ద్వారా అయినా బ్లాక్ బస్టర్ వస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు