Akhil: ఏజెంట్ కి ఇంత అవమానమా..?

అక్కినేని అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఎన్నో అంచనాలతో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఏజెంట్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ మీదకు వెళ్ళటమే సినిమా డిజాస్టర్ అవ్వటానికి కారణమని స్వయంగా నిర్మాత అనిల్ సుంకర స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అయితే, సినిమా రిలీజ్ అయ్యి సుమారు మూడు నెలలు గడుస్తున్నా కానీ, ఓటీటీలో స్ట్రీమింగ్ కి నోచుకోకపోవడంతో ఏజెంట్ సినిమా తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. గతంలో ఈ సినిమాను రీఎడిట్ చేస్తున్నారని వార్తలు రాగా, వాటిల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు నిర్మాత. ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడన్నది సోనీ లివ్ సంస్థ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు.

నిజానికి మే 19న సోనీ లివ్ పై ఏజెంట్ స్ట్రీమ్ అవుతుందని ప్రకటించారు కానీ రిలీజ్ చేయలేదు. ఆ తర్వాత రెండు, మూడు సార్లు డేట్స్ అనౌన్స్ చేసినప్పటికీ రిలీజ్ చేయలేదు సోనీ లివ్ సంస్థ. ఇప్పుడు ఏజెంట్ స్ట్రీమింగ్ ని పూర్తిగా నిలిపివేయాలని సోనీ లివ్ డిసైడ్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే, సురేందర్ రెడ్డి లాంటి డైరక్టెర్, అఖిల్ లాంటి స్టార్ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో కాంబినేషన్లో వచ్చి కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కి నోచుకోని సినిమాగా చరిత్రలో నిలుస్తుంది ఏజెంట్ సినిమా.

వాస్తవానికి ఏజెంట్ లాంటి డిజాస్టర్ సినిమాలు చాలానే వచ్చినప్పటికీ, ఆ సినిమాలకు ఇలాంటి దుస్థితి రాలేదు. నెల తిరిగేలోగా స్టార్ హీరోల సినిమాలు సైతం ఓటీటీలో రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్న ఈ రోజుల్లో సోనీ లివ్ ఏజెంట్ ని ఎందుకు వదిలేస్తుందో కారణాలు తెలియాల్సి ఉంది. మరి, థియేటర్లలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న ఏజెంట్ సినిమా కనీసం ఓటీటీ స్ట్రీమింగ్ కి కూడా నోచుకోక మరో పరాభవాన్ని ఎదుర్కొంటుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు