Anirudh copy tune viral: చివరికి అనిరుధ్ కూడా కాపీ క్యాట్ అయిపోయాడుగా.. !

Anirudh copy tune viral

ప్రస్తుతం ఇండియాలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ లలో టాప్ ప్లేస్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుసగా వస్తోన్న భారీ పాన్ ఇండియన్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ సంగీత ప్రపంచంలో సెన్సేషన్ గా దూసుకుపోతున్న అనిరుధ్, గత రెండు రోజులుగా కాపీ క్యాట్ అనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

ఇటీవల కాలంలో ఒక సినిమా సక్సెస్ లో మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే తో పాటు సినిమా పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో సంగీత దర్శకులకు భారీగా డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. ఇక కోలీవుడ్ లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అనిరుధ్ ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలనే రజీనికాంత్ నటించిన జైలర్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టిన అనిరుధ్, హిందీలో షారుఖ్ ఖాన్, అట్లీ కాంబినేషన్ లో వస్తోన్న జవాన్ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతున్న ఈ సినిమా నుంచి రెగ్యులర్ గా అప్డేట్స్ అందిస్తున్నారు మేకర్స్.

ఇక ఇటీవలనే ఈ జవాన్ సినిమాలోని “ఛలోనా” అనే పాటను రిలీజ్ చేయగా, మంచి మెలోడీ ట్యూన్ తో ఈ పాట అందరిని ఆకట్టుకుంటుంది. గతంలో జవాన్ సినిమా నుంచి రిలీజైన మొదటి పాట “దుమ్మే దులిపేలా” సాంగ్ కంటే కూడా ఛలోనా పాట బాగుందని ప్రశంషలు కూడా అందుకుంది. అయితే ఈ ప్రశంషలతో పాటు, ఈ సాంగ్ ట్యూనింగ్ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ విమర్శల పాలు కూడా అవుతున్నాడు.

- Advertisement -

అయితే ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ గతంలో నటించిన అజ్ఞాతవాసి సినిమాలోని గాలివాలుగా అనే సాంగ్ లాగా ఉందని నెగిటివ్ కామెట్స్ వస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాకు కూడా అనిరుధే సంగీత దర్శకుడిగా పని చేయడంతో తన ట్యూన్ ను తానే కాపీ చేసుకున్నాడంటూ, సోషల్ మీడియాలో అనిరుధ్ ను పలువురు విమర్శిస్తున్నారు. ఒరిజినల్ మ్యూజిక్ ఇస్తున్నాడని అనిరుధ్ అందరు పొగుడుతుంటే ఇక అనిరుధ్ కూడా మిగితా మ్యూజిక్ డైరెక్టర్ లాగా కాపీ క్యాట్ అయిపోయాడుగా అంటూ కామెంట్స్ చేస్తూ ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు