Raghava Lawrence Movie: చంద్రముఖి 2ని రజనీకాంత్ ఎందుకు రిజెక్ట్ చేశారో తెలుసా?

Raghava Lawrence Movie

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లో చాలా సినిమాలు చేశారు. అందులో బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. కానీ, ఆయన సినిమాల్లో అన్నింటికీ కంటే చంద్రముఖికి ప్రత్యేక స్థానం ఉంది. మలయాళం వచ్చిన మణిచిత్రతరాజు మూవీ అఫీషియల్ రీమేక్ గా ఇది వచ్చింది. కానీ, ఆడియన్స్ ఒరిజినల్ వెర్షన్ కంటే, చంద్రముఖికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంతే కాదు, సినిమా పరిశ్రమలో హర్రర్ కామెడీ సినిమాలు ఇలా ఉండాలి అనే విధంగా చంద్రముఖి ప్రత్యేక ముద్ర వేసుకుంది.

అయితే ప్రస్తుతం చంద్రముఖికి సీక్వెల్‌గా చంద్రముఖి2ని డైరెక్టర్ పి. వాసు తెరకెక్కించాడు. ఇది సెప్టెంబర్ 15న విడుదల కానుంది. దీనిలో మునితో పాటు కాంచన వంటి హర్రర్ కామెడీ సినిమాల్లో నటించిన లారెన్స్ హీరోగా చేస్తున్నాడు. అయితే, చంద్రముఖి2లో రజినీకాంత్ ఎందుకు నటించడం లేదు? ఈ స్టోరీని రజినీకాంత్ ఎందుకు రిజెక్ట్ చేశాడు? అనే ప్రశ్నలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన నాటి నుంచి వస్తున్నాయి.

ఎట్టకేలకు ఈ ప్రశ్నలకు సమాధానం దొరికింది. స్వయంగా డైరెక్టర్ పి. వాసు ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చేశారు. చంద్రముఖి2 స్టోరీని డైరెక్టర్ పి. వాసు రెడీ చేసి, ముందుగా రజినీకాంత్ వద్దకే వెళ్లారట. రజినీ కాంత్ కూడా చాలా ఆసక్తిగా స్టోరీ మొత్తం విన్నారట. అంతే కాదు, స్టోరీ చాలా బాగుంది. మంచి విజయం సాధిస్తుందని కూడా చెప్పారట. కానీ, ఈ స్టోరీకి తన కంటే, రాఘవ లారెన్స్ బాగా సెట్ అవుతాడని డైరెక్టర్ పి. వాసుకి చెప్పారట.

- Advertisement -

లారెన్స్ పేరును స్వయంగా రజినీకాంతే సిఫారసు చేయడంతో పి. వాసు లారెన్స్ ను సంప్రదించారట. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్, అందులోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన పాత్ర, మళ్లీ ఆయనే చేయమని చెప్పడంతో లారెన్స్ నో.. చెప్పకుండా చంద్రముఖి2కి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలా చంద్రముఖి2 స్టోరీ రజినీకాంత్ (Rajinikanth) నుంచి రాఘవ లారెన్స్ వరకు వచ్చింది.

Check out Filmify for the latest Bollywood Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Bollywood, Hollywood, Tollywood, Mollywood, and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు