Rajinikanth: రిలీజ్ కి ముందే.. హిమాలయాలకి రజినీ పయనం..

Rajinikanth’s trip to the Himalayas..

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో ఎంత స్టైలిష్ గా ఉంటారో, నిజ జీవితంలో అంత సింపుల్ గా ఉంటారు. కొందరు హీరోల్లాగా బయటికి విగ్ పెట్టుకొని, మేకప్ వేసుకొని కాకుండా, ఆయన ఇంట్లో ఎలా ఉంటారో సోసిటీ లోను అలా ఉంటారు. ఇక రజినీకాంత్ ఆధ్యాద్మికత కి ఎక్కువ విలువ ఇస్తాడని తెలిసిందే.

శివ భక్తుడైన ఆయన ఎప్పుడూ పూజలు చేస్తూ, దేవాలయాలు సందర్శిస్తూ ఉంటారు. ఇక రజినీకాంత్ హిమాలయాల జీవితం గురించి కూడా తెలిసిందే. ప్రతి సంవత్సరం హిమాలయాలకు వెళ్లి కొన్నిరోజులు సాధారణ సగటు మనిషిలా బతకడం ఆయనకు అలవాటు. అక్కడి చెట్ల కిందే యోగాలు చేస్తూ, అక్కడి ప్రాంత వాసులతో కొన్నాళ్ళు గడపడం ఆయనకి అలవాటుగా మారింది.

అయితే గత కొన్నేళ్లుగా కరోనా ప్రభావం వల్ల రజినీకాంత్ హిమాలయాలకు వెళ్లలేదు. ఇక రీసెంట్ గానే తన జైలర్ సినిమా ప్రమోషన్లు మొత్తం పూర్తి చేసిన రజినీకాంత్ ఇప్పుడు ఫ్రీ అయ్యాడు. అందుకే మళ్ళీ హిమాలయాలకు పయనమయ్యాడు. ఈ విషయం రజినీకాంత్ కార్ లో వెళ్తుండగా మీడియా వాళ్ళు అడగగా, కరోనా వల్ల గ్యాప్ వచ్చిందని, నాలుగేళ్ళ విరామం తర్వాత వెళ్తున్నానని అన్నారు. చాలా సంతోషంగా ఉందని అన్నారు.

- Advertisement -

అయితే జైలర్ సినిమా రిలీజ్ కి ముందే రజినికాంత్ హిమాలయాలకు పయనం అవుతుండడం గమనార్హం. బహుశా మరో నెలరోజుల వరకు రజినీకాంత్ సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఆయన నటించిన జైలర్ ఆగష్టు10న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు