Mahesh babu : బిజినెస్ మ్యాన్ 2 పై పూరి ఇకనైనా నోరు విప్పుతాడా ?

Mahesh babu’s businessman 2 on cards ?

సూపర్ స్టార్ మహేష్ బాబు- పూరి జగన్నాథ్ కాంబినేషన్ కు తెలుగు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని మహేష్ బాబు కెరీర్ లోనే గుర్తుండిపోయే చిత్రాలుగా నిలిచాయి.

అయితే ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ -పూరి కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మ్యాన్ సినిమాను రీ-రిలీజ్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ అయిన ఈ రీ-రిలీజ్ లో ట్రెండ్ లో భాగంగా రిలీజైన మహేష్ బాబు పోకిరి, ఒక్కడు సినిమాలు థియేటర్స్ లో రీరిలీజై మంచి కలెక్షన్స్ తో రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు అదే ఫ్లో ను ప్రస్తుతం బిజినెస్ మ్యాన్ సినిమా కూడా కంటిన్యూ చేస్తుంది. ఒక పక్క స్ట్రయిట్ సినిమాలైన మెగాస్టార్ భోళా శంకర్, జైలర్ సినిమాలు ఉన్న కూడా పలు చోట్ల బిజినెస్ మ్యాన్ అడ్వాన్స్ బుకింగ్ రెండు సినిమాలను బీట్ చేసే విధంగా నమోదు అయ్యాయంటే ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు.

అయితే బిజినెస్ మ్యాన్ సినిమా ఒరిజినల్ గా రిలీజై, సూపర్ హిట్ అయిన తరువాత పలు సక్సెస్ మీట్ లలో బిజినెస్ మ్యాన్ 2 సినిమా కూడా చేస్తానని పూరి జగన్నాథ్ చేసిన పలు వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే బిజినెస్ మ్యాన్ సినిమా తరువాత మహేష్ బాబు, పూరి జగన్నాథ్ ఎవరి సినిమాలలో వాళ్ళు బిజీ అవడంతో బిజినెస్ మ్యాన్2 సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు.

- Advertisement -

ఇప్పుడు బిజినెస్ మ్యాన్ సినిమా రీ- రిలీజ్ పుణ్యమా అని పూరి జగన్నాథ్ చేసిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో బిజినెస్ మ్యాన్2 సినిమాను పూరి- మహేష్ మళ్ళీ చేయాలనీ సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇది వరకే పూరి పలు సార్లు మహేష్ సినిమా చేయాలనీ తనకు ఉన్నప్పటికీ మహేష్ ఆయనతో కలిసి పని చేయడానికి రెడీ గా లేడంటూ పలు సార్లు విమర్శించాడు. మరీ ఈ వాదనలన్నీ పక్కన పెట్టి ఫ్యాన్స్ కోసం పూరి మహేష్ కలిసి మళ్ళీ బిజినెస్ మ్యాన్2 సినిమా చేస్తారా లేదా అనేది ప్రస్థానార్థకంగా మారింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు