BIG breaking : మహేష్ బాబుకు బర్త్ డే విషెష్ చెప్పిన పవన్ కళ్యాణ్- ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది

Pawan kalyan wishes to Mahesh babu

మహేష్ బాబు సినిమాల అప్డేట్ ల సంగతి పక్కన పెడితే అంతకంటే ఎక్కువ కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి ప్రస్తుతం మహేష్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పాలి. ఆ న్యూస్ మరేదో కాదు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెష్ తెలియజేయడమే.

టాలీవుడ్ కు ఎంత మంది యంగ్ హీరోలు వచ్చిన కూడా అగ్ర హీరోల స్థానంలో కొనసాగుతుంది మాత్రం మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లే అని చెప్పాలి.ఈ ఇద్దరు స్టార్స్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, సినిమాల కలెక్షన్స్ కానీ వేరే లెవల్ అని చెప్పాలి. అందుకే వీరిద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడిన, ఒకరి వ్యాఖ్యలకు ఇంకొకరు స్పందించిన ఆ న్యూస్ పెద్ద సెన్సేషన్ అవుతుంది. అలాగే ఫ్యాన్స్ లో కూడా కొత్త జోష్ ను తీసుకువస్తుంది.

సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు పోటీపడుతూనే ఉండే ఈ ఇద్దరు స్టార్స్ పర్సనల్ గా మాత్రం చాలా సహోదర భావంతో ఉంటారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పలు సార్లు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు మీడియా ముఖంగానే స్పందించారు.

- Advertisement -

ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెష్ తెలియజేస్తూ ఒక నోట్ కూడా విడుదల చేయగా, ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

“తెలుగు చలన చిత్రసీమలో తనదైన పంథా కలిగిన అగ్రశ్రేణి కథానాయకుడు శ్రీ మహేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ మహేష్ బాబు కథానాయకుడిగా అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ వృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. తండ్రి నటశేఖర కృష్ణ గారి అడుగుజాడల్లో వెళ్తూ, విభిన్న పాత్రల్లో మెప్పించే అభినయ సామర్థ్యం ఆయన సొంతం. సోదరసమానుడైన శ్రీ మహేష్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.శ్రీ మహేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు – శ్రీ పవన్ కళ్యాణ్ గారు ” అని జనసేన పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఈ నోట్ రావడంతో మహేష్ బాబు అంత తెగ ఆనందపడుతున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు