Chiranjeevi: భోళా శంకర్ లో అందరి ఫోకస్ దానిపైనే.. ఇంతకీ ఉందా? లేదా?

Chiranjeevi fans focus on that scene in Bhola Shankar?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై మొదట పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా, రీసెంట్ గా విడుదలైన పాటలు, ట్రైలర్లు మెప్పించడంతో భోళా శంకర్ పై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా తమిళ్ హిట్ వేదాళం కి రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న భోళా శంకర్ సినిమాపై ఆ ఒక్క సీన్ పైనే ఆడియన్స్, ట్రోలర్స్ దృష్టి పడింది.

అదే ఇంటర్వెల్ సీన్.. వేదాళంలో హీరోని విలన్ గ్యాంగ్ పట్టుకున్నప్పుడు సౌమ్యుడిగా, అమాయకంగా కనిపించే హీరో విలన్ భయపడుతూ చూస్తూ, ఒక్కసారిగా తన ఫేస్ లో వైలెంట్ యాంగిల్ ని నవ్వుతూ ఛేంజ్ చేస్తూ ట్రాన్స్ ఫార్మ్ అయ్యే తీరు అద్భుతం అని చెప్పాలి. ఈ సీన్ లో అజిత్ ఎక్స్ ప్రెషన్స్ ఓ రేంజ్ లో హైలెట్ అయ్యాయి. సినిమా మొత్తానికి ఈ సీనే హైలెట్ అయ్యింది. ఈ సినిమా ఇతర భాషల్లో రిలీజ్ కాకపోయినా ఈ ఇంటర్వెల్ సీన్ ని మాత్రం యూట్యూబ్ లో చాలా మంది చూసేసారు.

అయితే ఇప్పుడు రిలీజ్ కాబోతున్న భోళా శంకర్ లో ఆ సీన్ ని ఎలా డిజైన్ చేశారన్నది ఆసక్తిగా మారింది. కొందరు ట్రేడ్ పండితులు ఆ సీన్ ని మార్చి చిరు కి తగ్గట్టు రాసారని అంటుంటే, మరికొందరు అసలు ఆ సీన్ నే సినిమాలో పెట్టలేదని అంటున్నారు. అయితే చాలా మంది ఆడియన్స్ ఆ సీన్ కోసమే సినిమాకి వస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఇక ఇంటర్వెల్ లో ఆ సీన్ ఏమాత్రం మిస్ ఫైర్ అయినా చిరు ట్రోలర్స్ కి అడ్డంగా దొరికిపోతాడు. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీ జనాలు సినిమా చెడగొట్టారని ఊదరగొడతారు. ఇంతకీ ఆ సీన్ సినిమాలో ఉందా, ఒకవేళ ఉంటే ఎలా డిజైన్ చేసారో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు