Bhola shankar: మెహర్ రమేష్ ఆశ తీరింది! మరి హిట్ పరిస్థితి?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం “భోళా శంకర్”. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తమిళ హిట్ వేదాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చిరు కి చెల్లెలిగా ప్రత్యేక పాత్రలో నటించింది. ఇక తనకి జోడిగా సుశాంత్ నటించాడు. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలోనే కాదు, మెగా అభిమానుల్లోనూ ఎలాంటి అంచనాలు లేవు. ఎందుకంటే 15 ఏళ్లుగా హిట్ లేని మెహర్ రమేష్ కి ఛాన్స్ ఇవ్వడమే దీనికి కారణం. దానికి తోడు ఈ సినిమా టీజర్ కూడా రొటీన్ గా ఉండడంతో మెహర్ రమేష్ పై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

తాజాగా భోళా శంకర్ కి సంబంధించి ఒక అప్డేట్ ని తెలియచేస్తూ ట్విట్టర్  లో పోస్ట్ చేసాడు మెహర్ రమేష్. భోళా శంకర్ సినిమాతో మెగాస్టార్ ని డైరెక్ట్ చేయాలనుకున్న తన కల తీరిందని అన్నాడు. అంతే కాదు ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తయిపోయిందని, ఇక పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ కార్యక్రమాలే ఉన్నాయని చెప్పాడు.

ఈ విషయం పై అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తో మూవీ ఎన్నో ఏళ్ళ నీ కల నెరవేరింది. మరి హిట్ సినిమా కోరుకుంటున్న మా కల నెరవేరుతుందా అని అభిమానులు సోషల్ మీడియా లో ట్వీట్ లు వేస్తున్నారు. అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఇదే ఆసక్తి రేగుతుంది. ఎందుకంటే చిరు వాల్తేరు వీరయ్య తో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చి, భోళా శంకర్ ద్వారా మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.

- Advertisement -

కానీ ఇప్పటివరకు ఈ సినిమాకి పాజిటివ్ గా వచ్చిన అంశాలు ఎక్కువగా లేవు. చిరంజీవే ఈ సినిమాకు బలం. మరి ఈ సినిమాకు ఇప్పటికైనా హిట్ అయ్యే ఓపెనింగ్స్ రావాలంటే, ఇప్పట్నుంచే ప్రమోషన్లు మొదలు పెట్టాలని నెటిజన్లు అంటున్నారు. మరి చిరు ని డైరెక్ట్ చేయాలనుకున్న మెహర్ కల తీరినట్టే, భోళా శంకర్ హిట్ కావాలనుఉంటున్న చిరు ఫ్యాన్స్ కోరిక కూడా నెరవేరుతుందో లేదో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు