Saamajavaragamana: నాలుగు రోజులు పది కోట్లు.. అసలు పరీక్ష ఇప్పట్నుంచే

శ్రీ విష్ణు హీరోగా నటించిన సామజవరగమన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు సాధిస్తుంది. ఏ అంచనాలు లేకున్నా పలు సినిమా మధ్య పోటీగా రిలీజ్ అయినా, ఈ సినిమాకి వచ్చిన మౌత్ టాక్ తోనే భారీ వసూళ్లు సాధించింది. ఏకే ఎంటెర్టైనేమేంట్స్ బ్యానర్ లో ఏజెంట్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఈ సినిమా విజయం ఆ ప్రొడ్యూసర్స్ కి ఊరటనిచ్చింది. ఇక జూన్ 29న విడుదలైన ఈ సినిమా మూడు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల 90 లక్షల షేర్ ని వసూలు చేసింది.

అయితే కేవలం 3.50 కోట్ల టార్గెట్ తోనే బరిలోకి దిగిన ఈ సినిమా మూడో రోజుతోనే లాభాల బాట పట్టడం విశేషం. తాజాగా వచ్చిన నాలుగు రోజుల కలెక్షన్లతో డబల్ ప్రాఫిట్ సాధించే దిశగా దూసుకుపోతుందని చెప్పాలి. నాలుగవ రోజు సామజవరగమన ప్రపంచ వ్యాప్తంగా 1.61కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఆదివారం వర్షాల ప్రభావం వలన కొంత ఎఫెక్ట్ పడినా మంచి వసూళ్లే సాధించింది ఈ సినిమా. ఇక ఈ సినిమా నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 5.41 కోట్ల షేర్ ని 10.10 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.

సామజవరగమన ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి బాగా రప్పించింది. అయితే ఈ సినిమాకి ఇప్పట్నుంచే అసలు పరీక్ష ఎదురవనుంది. వీకెండ్ కావడంతో సినిమా కి ఫ్యామిలీ ఆడియన్స్ సహకారంతో హిట్ అయింది. మరి ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా ఇలాగే అదరగొడుతుందా లేదా అన్నది చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు