Prabhas: రాముడి అవతారం ముగిసింది- ఇక రావణుడి రాక కు రూట్ క్లియర్

కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో, ప్రభాస్ హీరోగా వస్తోన్న సలార్ సినిమా సందడి తొందర్లోనే మొదలవబోతుంది. హోంబలె ఫిలిమ్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోవడంతో ఇక ఈ సినిమా అప్డేట్స్ ఇస్తూ, ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపడానికి సలార్ టీం రెడీ అయినట్టు తెలుస్తుంది.

ఇటీవలనే ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ సినిమా ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరచడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంత ఇప్పుడు సలార్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఆయన సినిమాలలో హీరోలను ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తాడో కెజిఎఫ్ సినిమాతో ప్రూవ్ అవడంతో సలార్ సినిమా కూడా ఆ రేంజ్ లో ఉండబోతుందని ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే సలార్ సినిమాకు సంబంధించి టీజర్ ను జులై 6 ఉదయం 5 గంటల 12 నిమిషలకు రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ టీం ప్రకటించింది. దాంతో సోషల్ మీడియా ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఈ సినిమాపై పోస్ట్ లు వేస్తూ, హల్చల్ చేస్తున్నారు.

- Advertisement -

సలార్ సినిమా కూడా కెజిఎఫ్ సినిమా తరహాలో రెండు పార్ట్ లుగా రాబోతుంది. ఈ సినిమా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 28న గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ డబుల్ యాక్షన్ చేస్తున్నారు. మొదటి పార్ట్ లో కొడుకుకి సంబందించిన కథను, రెండో పార్ట్ లో ఫ్లాష్ బ్యాక్ చూపించబోతున్నారని టాక్. విడుదల ముందే స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు