Nikhil: “స్పై” వీకెండ్ కలెక్షన్స్… ఇక మీదటే అసలు?

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన “స్పై” జూన్29న విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన దక్కించుకుంది. అయితే “స్పై” సినిమా మొదటి రోజు మాత్రం టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు సాధించింది. ఫస్ట్ డే ఏకంగా 11 కోట్లు రాబట్టి నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. కానీ ఆ తర్వాత మాత్రం కలెక్షన్లు డల్ అయ్యాయి. ఈ సినిమాకి వచ్చిన మిక్సిడ్ రెస్పాన్స్ కి తోడు పోటీగా రిలీజ్ అయిన సామజవరగమన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో ఈ సినిమాకి వచ్చే కలెక్షన్లు కూడా ఆ సినిమాయే దక్కించుకుంది.

తాజాగా “స్పై” సినిమాకి సంబంధించి నాలుగో రోజు కలెక్షన్ల వివరాలు బయటికి వచ్చాయి. నాలుగో రోజు సెలవురోజే అయినా వర్షాల ఎఫెక్ట్ వల్ల చాలా స్లో అయ్యాయి. మొత్తం మీద నాలుగో రోజు వరల్డ్ వైడ్ గా 89 లక్షల షేర్ ని వసూలు చేసింది. ఇక స్పై సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 9.98 కోట్ల షేర్ ని 16 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అయితే ఈ సినిమాకి 17.50 కోట్ల బిజినెస్ జరగగా, వచ్చిన వసూళ్లు కాక ఇంకా దాదాపు 8.50 కోట్లయినా కావాలి.

అయితే ఈ సినిమా కి వచ్చిన టాక్ కి బ్రేక్ ఈవెన్ అవడం అంటే డౌటే అనాలి. అదీగాక ఇప్పుడు వీకెండ్ అయిపోయి వర్కింగ్ డే స్టార్ట్ అయ్యింది. సెలవురోజు కూడా కోటి రూపాయలు వసూలు చేయలేని ఈ సినిమా వీకెండ్ తర్వాత ఆడుతుందా అంటే చెప్పలేం. కానీ నష్టాలు తగ్గించే అవకాశం ఉంది. మరి వీకెండ్ లో కొంతవరకు గట్టెక్కిన స్పై ఆ తర్వాత ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు