Akhil: ఏజెంట్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఏజెంట్ సినిమా రిలీజ్ అయ్యి మూడు నెలలు అయినా ఇంకా ఓటీటీ లో స్ట్రీమ్ అవ్వకపోవటం చర్చనీయాంశం అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి రీఎడిట్ చేస్తున్నారని కొత్త వర్షన్ ని త్వరలోనే రిలీజ్ చేస్తారని వార్తలొచ్చాయి. ఆ వార్తల్లో వాస్తవం లేదని నిర్మాత అనిల్ సుంకర క్లారిటీ ఇచ్చాడు. ఏజెంట్ ని రీ ఎడిట్ చేస్తున్నారన్న వార్తల్లో వాస్తవం లేదని, ఒరిజినల్ కాపీ తమ వద్దనే ఉందని, ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది సోనీ లివ్ సంస్థ నిర్ణయం మీద ఆధారపడి ఉందని స్పష్టం చేసాడు అనిల్ సుంకర. దీంతో గత కొంత కాలంగా వస్తున్న రూమర్స్ కి చెక్ పడినట్లయింది.

ఏజెంట్ లాంటి డిజాస్టర్ సినిమాలు గతంలో చాలానే వచ్చినప్పటికీ వాటిలో ఏ సినిమాను కూడా ఇలా వోటీటీలో రిలీజ్ చేయకుండా ఆపలేదు. మరి, సోనీ లివ్ టీమ్ ఏజెంట్ సినిమాని రిలీజ్ చేయకుండా ఆపటానికి కారణం ఏంటన్నది ప్రశ్నగా మారింది. బ్లాక్ బస్టర్ సినిమాలనే 40రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తున్న పరిస్థితుల్లో ఏజెంట్ లాంటి డిజాస్టర్ ని 100 రోజులకు రిలీజ్ చేస్తే ఆడియెన్స్ కి చూడాలన్న ఆసక్తి ఉండటం అసాధ్యం.

ఏజెంట్ డిజాస్టర్ తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి తన నెక్స్ట్ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉండగా, అఖిల్ కూడా కొంత గ్యాప్ తీసుకొని తన నెక్స్ట్ సినిమాకి రెడీ అవుతున్నారు. నిర్మాత అనిల్ సుంకర కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న భోళాశంకర్ తో బిజీగా ఉండగా ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి మాత్రం సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతూనే ఉంది. మరి, సోనీ లివ్ ఏజెంట్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు