Anushka: సేఫ్ డేట్ కి వస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’..!

లేడి సూపర్ స్టార్ అనుష్క నిశ్శబ్దం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి నటిస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. అనుష్క, నవీన్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమాపై మొదటి నుండి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ సినిమాకు సంబందించిన ప్రోమోలు, లిరికల్ సాంగ్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమా మొదలై చాలా కాలం అవుతున్నప్పటికీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోవటం వల్ల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.

ఈ సినిమాను ఆగస్టు 4న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది సినిమా యూనిట్.జాతి రత్నాలు తర్వాత నవీన్ నటించిన సినిమా కావటం, అనుష్క చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద కనిపించనుండటంతో ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు మొదటివారంలో పెద్దగా కాంపిటీషన్ లేకపోవటం ఈ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

టాలీవుడ్ కి ఈ వేసవిలో సరైన హిట్ లేకపోవటం, ఎన్నో అంచనాలతో వచ్చిన ఆదిపురుష్ కూడా పెద్దగా అలరించకపోవటం వల్ల బాక్సాఫీస్ వద్ద వ్యాక్యూమ్ ఏర్పడింది. ఈ అంశం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు కలిసొచ్చే అంశం అని చెప్పాలి. ఇక ఆగస్టులో ఇండిపెండెన్స్ డే సందర్బంగా భోళాశంకర్, జైలర్ వంటి సినిమాలు సెకండ్ వీక్ లో రిలీజ్ అవుతున్నాయి. మొదటి వారం ఎలాగో థియేటర్లు ఖాళీ కాబట్టి ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే సూపర్ హిట్ ఖాయం అని చెప్పవచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు