BIG breaking : దేవర సినిమా ఆగిపోయిందా ? కన్ఫ్యూజన్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్

devara movie latest update

ఎన్టీఆర్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా దేవర పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కొత్త కన్ఫ్యూజన్ మొదలైంది. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుందని అప్డేట్స్ వస్తుండగా, లేటెస్ట్ గా దేవర సినిమా తాత్కలికంగా ఆగిపోయిందనే న్యూస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కలవర పెడుతుంది.

వివరాల్లోకి వెళ్తే.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న దేవర సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ రావడంతో దేవర సినిమాను చాలా జాగ్రతగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారని టాక్ నడుస్తుంది. గత కొద్దీ రోజులుగా దేవర సినిమా షూటింగ్ ను హైదరాబాద్ లోని ఒక ప్రత్యేక సెట్ హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పలు యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నరని వార్తలు మెండుగా వచ్చాయి.

కానీ తీరా ఈరోజు చూస్తే ఎన్టీఆర్ ఒక యాడ్ షూటింగ్ కోసమని తన లుక్ ను కంప్లిట్ గా మార్చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రముఖ సెలెబ్రెటీ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఎన్టీఆర్ కొత్త లుక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఆ లుక్ ను బట్టి చూస్తే ఎన్టీఆర్ గడ్డం, మరియు హెయిర్ ను ట్రిమ్ చేసినట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఒక పక్క దేవర షూటింగ్ జరుగుతుండగా ఈ విధంగా ట్రిమ్ చేయడం అభిమానుల్లో ఆందోళనను కలిగిస్తుంది. దేవర తాత్కాలికంగా నిలిచిపోయిందా ? లేక ఎన్టీఆర్ కావాలనే బ్రేక్ తీసుకున్నారా ? ఒక పక్క షూటింగ్ జరుగుతుండగా ఎన్టీఆర్ హెయిర్ స్టయిల్ ఎలా చేంజ్ చేసాడని ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ మొదలైంది. ఇక ఈ కన్ఫ్యూజన్ ను పక్కన పెడితే ఎన్టీఆర్ కొత్త లుక్ మాత్రం ఫ్యాన్స్ తెగ నచ్చింది. ఇప్పటికే ఎన్టీఆర్ లీషియస్ ఫుడ్, యాపీ ఫిజ్, మెక్ డొనాల్డ్స్ వంటి బ్రాండ్స్ కు అంబాసిటర్ గా కొనసాగుతుండగా మరో కొత్త యాడ్ కు ఆయన బ్రాండ్ అంబాసిటర్ కావడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. ఇక మరీ దేవర పరిస్థితి ఏంటో ఆ దేవుడికే తెలియాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు