Dilraju: ఫైనల్‌గా మెగాస్టార్‌తో దిల్ రాజు మూవీ?

Dil Raju movie with megastar finally?

టాలీవుడ్ యాక్టింగ్ కేటగిరిలో మెగాస్టార్ అంటే చిరంజీవి. అదే ప్రొడ్యూసర్‌లలో నెంబర్ వన్ అంటే దిల్ రాజు. దిల్ రాజు ఇన్నేళ్ళపాటు సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతూ ఉన్నాడంటే అది అతనిలోని స్కిల్స్ వల్లనే అని చెప్పాలి. అయితే దిల్ రాజు దాదాపు 20 ఏళ్ల నుంచి సినిమాలను నిర్మిస్తున్నాడు. కానీ, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాను నిర్మించలేదు. వీళ్ల కాంబోలో సినిమా రావాలని మెగా ఫ్యాన్స్ కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు.

ఈ వెయిటింగ్‌కు తెర పడేలా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ జరుగుతున్న చర్చలను చూస్తే, మెగాస్టార్ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేసే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి ఓ కథతో మెగాస్టార్‌ని కలిశాడట. కొన్ని ఛేంజేస్‌తో ఆ స్టోరీని చిరు ఫైనల్ చేశాడని టాలీవుడ్ వీధుల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. దీనికి దిల్ రాజునే ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నట్టు టాక్.

సాధారణంగా అనిల్ రావిపూడి మూవీ అంటే కామెడీ యాంగిల్ ఓ రేంజ్‌లో ఉంటుంది. చిరు కూడా కామెడీ రోల్స్ చేయడానికి బ్యాక్ స్టెప్ వేయడు. అలాగే బడ్జెట్ విషయంలో కూడా దిల్ రాజు అంత ఈజీగా కంప్రమైజ్ అవ్వడు. ఇలా ఈ కాంబినేషన్ లో మూవీ వస్తే, బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు అవ్వడం ఖాయమని అంటున్నారు సినీ లవర్స్. ఈ అనౌన్స్ మెంట్ చిరంజీవి బర్త్ డే రోజు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు