Salaar Movie Update: ప్రభాస్ కోసం శ్రుతి హాసన్ కష్టాలు.. ఏకంగా ఐదు?

Salaar Movie Update

ఒక తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, భారత సినీ పరిశ్రమ మొత్తం ఎదురుచూస్తున్న సినిమా సలార్. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి… కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడం. మరొకటి… బాహుబలి తర్వాత వరుసగా ఫెయిల్ అవుతున్న ప్రభాస్ నటిస్తున్న మూవీ కావడం. ఈ మూవీతో అయినా బాహుబలి రేంజ్ హిట్ కొట్టాలని ఇటు ప్రభాస్ చూస్తున్నాడు. కేజీఎఫ్ కంటే, పెద్ద హిట్ కొట్టాలని అటు ప్రశాంత్ నీల్ ట్రై చేస్తున్నాడు.

ఇలా సినిమా భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొంది, వచ్చే నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్లు మాత్రమే కాదు, హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా చాలానే కష్టపడుతుంది. ఇప్పటి వరకు తాను చేయని ప్రయోగం ఈ సినిమా కోసం చేయడానికి రెడీ అయిపోయింది. సలార్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అన్ని భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ లను కాకుండా, సినిమాలో చేసిన కాస్ట్ తోనే డబ్బింగ్ చెప్పిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

ఇప్పటికే ప్రభాస్ తన డబ్బింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నాడని టాక్. ఇప్పుడు శ్రుతి హాసన్ వంతు వచ్చేసింది. శ్రుతి హాసన్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదు భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటికే మూడు భాషల్లో డబ్బింగ్ పూర్తి చేసుకున్న శ్రుతి, మరో రెండు భాషల్లో కూడా డబ్బింగ్ పూర్తి చేయడానికి సన్నద్దమవుతుంది. సినిమాలో ఒరిజినాలిటీ మిస్ అవ్వొద్దనే ఉద్దేశంతోనే అన్ని భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పాలని శ్రుతి అనుకుంటుందట. కొన్ని రోజుల్లోనే డబ్బింగ్ ప్రక్రియా పూర్తి చేసి, ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు